Leading News Portal in Telugu

Moto X70 Air slim smartphone like Apple Air, launched


  • మోటో X70 ఎయిర్ విడుదల
  • 6.7-అంగుళాల 1.5K రిజల్యూషన్ AMOLED డిస్‌ప్లే

మోటరోలా ఆపిల్ అత్యంత సన్నని ఐఫోన్ ఆపిల్ ఎయిర్ లాంటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ మోటో X70 ఎయిర్ ను ప్రవేశపెట్టింది. దీని మందం 159.87 x 74.28 x 5.99mm, బరువు 159 గ్రా. మోటో X70 ఎయిర్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 1.5K రిజల్యూషన్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో వస్తుంది. ఈ ఫోన్ 12 GB RAM, 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది.

మోటో X70 ఎయిర్ గ్రే, లిల్లీ ప్యాడ్, బ్రాంజ్ కలర్స్ లో లభిస్తుంది. దీని ధర 12GB RAM, 256GB మోడల్ ధర 2,599 యువాన్లు (సుమారు రూ. 32,207), 512GB స్టోరేజ్ మోడల్ ధర 2,899 యువాన్లు (సుమారు రూ. 36,000). ఇది అక్టోబర్ 31న చైనాలో అమ్మకానికి వస్తుంది. ఈ ఫోన్‌ను భారతదేశంతో సహా ప్రపంచ మార్కెట్లలో మోటరోలా ఎడ్జ్ 70గా లాంచ్ చేయవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

మోటో X70 ఎయిర్ 6.7-అంగుళాల 1.5K రిజల్యూషన్ 10-బిట్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా రక్షణ పొందుతుంది. మోటో X70 ఎయిర్ 4nm ప్రాసెస్‌పై నిర్మించిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 చిప్‌సెట్‌తో పాటు, అడ్రినో 722 GPU ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 12GB RAM, 256GB లేదా 512GB స్టోరేజ్ ఆప్షన్ తో వస్తుంది. ఇది తాజా Android 16 పై రన్ అవుతుంది. డ్యూయల్ సిమ్‌కు మద్దతు ఇస్తుంది.

మోటో X70 ఎయిర్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇది 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను కూడా కలిగి ఉంది. ముందు కెమెరా 50-మెగాపిక్సెల్. ఈ ఫోన్ USB టైప్-సి పోర్ట్, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్‌తో వస్తుంది. ఇది IP68, IP69 రేటింగ్ కలిగి ఉంది. ఈ ఫోన్ 4800mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.