Leading News Portal in Telugu

OnePlus Ace 6 Launch: 7800mAh Battery, 50MP Camera, Snapdragon 8 Elite, Here is Full Specs and Price


  • వన్‌ప్లస్ నుంచి సరికొత్త ప్రీమియం ఫోన్
  • 7800mAh బ్యాటరీ, 50MP కెమెరా
  • మైండ్ బ్లాక్ అయ్యే ఫీచర్స్ భయ్యో

OnePlus Ace 6 Launch and Price: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్‌’ తన తదుపరి ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌లను లాంచ్ చేసింది. వన్‌ప్లస్‌ 15 (OnePlus 15), వన్‌ప్లస్‌ ఏస్ 6 (OnePlus Ace 6) సోమవారం చైనాలో లాంచ్ అయ్యాయి. వన్‌ప్లస్‌ 13కు కొనసాగింపుగా వన్‌ప్లస్‌ 15 రాగా.. వన్‌ప్లస్‌ ఏస్ 5కు కొనసాగింపుగా వన్‌ప్లస్‌ ఏస్ 6 రిలీజ్ అయింది. త్వరలో భారత్‌కు ఈ ఫోన్స్ రానున్నాయి. ఏస్ 6 స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ 15 ఆర్ (OnePlus 15R)గా ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఏస్ 6 ఫీచర్స్ ఏంటో చూద్దాం.

Oneplus Ace 6 Launch

వన్‌ప్లస్‌ ఏస్ 6 స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్, 165Hz రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల FHD+ AMOLEDని కలిగి ఉంది. ఔటాఫ్‌ ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 16తో (ColorOS 16) పనిచేస్తుంది. క్వాల్‌కామ్‌కు చెందిన అత్యాధునిక స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉంటుంది. 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. బయోమెట్రిక్ భద్రత కోసం ప్యానెల్ ఇన్-డిస్‌ప్లే 3D ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది.

Oneplus Ace 6 Specs

వన్‌ప్లస్‌ ఏస్ 6 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ 7,800mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 120W వైర్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Oneplus Ace 6 Offers

12జీబీ + 512జీబీ వేరియంట్ ధర CNY 2,599 (సుమారు రూ. 32,300)గా కంపెనీ నిర్ణయించబడింది. 16GB + 256GB, 12GB + 512GB, 16GB + 512GB RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో కూడా ఉంది. ధరలు వరుసగా CNY 2,899 (సుమారు రూ. 36,000), CNY 3,099 (సుమారు రూ. 38,800), CNY 3,399 (సుమారు రూ. 42,200)గా ఉన్నాయి. 1612జీబీ + 1టీబీ టాప్-ఎండ్ కాన్ఫిగరేషన్ ధర CNY 3,899 (సుమారు రూ. 48,400)గా ఉంది. ఈ ఫోన్ అక్టోబర్ 30 నుండి ఒప్పో ఇ-షాప్, JDMall సహా కంపెనీ ఇతర ఆన్‌లైన్ స్టోర్‌ఫ్రంట్‌లలలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

Oneplus Ace 6 Price