- ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా?
- 13 వేల తగ్గింపు, బ్యాంక్ ఆఫర్స్ అదనం
- ఈ ఒప్పో ఫోన్ కోసం ఎగబడుతున్న జనం
Oppo Find X8 Pro 5G Offers: మీరు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా?.. అయితే ఇది మీకు గొప్ప అవకాశం అనే చెప్పొచ్చు. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘ఒప్పో’ నుంచి వచ్చిన ప్రీమియం ఫోన్ ఫైండ్ ఎక్స్ 8 ప్రో (Oppo Find X8 Pro)పై భారీ తగ్గింపు ఉంది. ప్రస్తుతం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ ‘క్రోమా’ వెబ్‌సైట్‌లో మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 (Oppo Find X9) సిరీస్ లాంచ్‌కు ముందు ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను గణనీయమైన తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 ప్రో భారతదేశంలో 2024 నవంబర్ మాసంలో లాంచ్ అయినపుడు 16 జీబీ + 512 జీబీ వేరియంట్ ధర రూ.99,999గా ఉంది. ఇప్పుడు క్రోమా వెబ్‌సైట్‌లో కేవలం రూ.86,999కి అందుబాటులో ఉంది. అంటే మీరు 13 వేల తగ్గింపును పొందవచ్చు. నేరుగా 13 శాతం తగ్గింపు పొందుతారన్నమాట. అలానే బ్యాంకు ఆఫర్స్ అదనంగా ఉన్నాయి. దాంతో మరింత తక్కువకే ఈ ఫోన్ మీ సొంతం అవ్వనుంది. ఇదే ఫోన్ ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.94,999కి అందుబాటులో ఉంది. 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ మాత్రమే ఉంది. మీరు ప్రీమియం కెమెరా ఫోన్ లేదా శక్తివంతమైన పనితీరు కలిగిన మొబైల్ కోసం చూస్తున్నట్లయితే ఈ డీల్ అద్భుతమైనదిగా చెప్పొచ్చు.

ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 ప్రో 6.78 అంగుళాల ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15తో రన్ అవుతుంది. మీడియాటెక్ డైమెన్‌సిటీ 9400 చిప్‌సెట్‌తో వచ్చిన తొలి ఫోన్ కూడా ఇదే కావడం గమనార్హం. దాంతో ఇది సూపర్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది. అలర్ట్ స్లయిడర్‌తో సహా ఐపీ68/ఐపీ69 రేటింగ్‌తో వచ్చింది. పెరల్ వైట్, స్పేస్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.

ఒప్పో ఫైండ్ ఎక్స్ ప్రోలో 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ-808 కెమెరా ఉంటుంది. 50 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 50 ఎంపీ పెరిస్కోపిక్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 6 ఎక్స్‌జూమ్ 50 ఎంపీ సెన్సర్ కెమెరాలు ఉన్నాయి. మొత్తంగా నాలుగు సెన్సర్లు ఉంటాయి. సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరాను ఇచ్చారు. ఇందులో 5,910 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు 50W ఎయిర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలానే 10W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
