Grokipedia: సాంకేతిక దిగ్గజం ఎలాన్ మస్క్ తన xAI సంస్థ ద్వారా కృత్రిమ మేధస్సు (Artificial Intelligence)తో నడిచే సరికొత్త ‘గ్రోకీపీడియా (Grokipedia) v0.1’ను అధికారికంగా విడుదల చేశారు. ఆన్‌లైన్ సృష్టిలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ, ఇది నేరుగా ప్రపంచ ప్రఖ్యాత వికీపీడియాకు గట్టి పోటీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. మరి ఈ కొత్త గ్రోకీపీడియా ఫీచర్స్ ఏంటంటే..?
ChatGPT Go: యూజర్లకు గుడ్ న్యూస్.. ChatGPT సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు ఫ్రీ
గ్రోకీపీడియా లక్షణాలలో ముఖ్యంగా చెప్పాలంటే.. ఇందులో సమాచారాన్ని సృష్టించడం, ధృవీకరించడం, నవీకరించడం వంటి ప్రక్రియలన్నింటినీ పూర్తిగా xAI సంబంధిత ‘గ్రోక్ (Grok)’ AI మోడల్ పర్యవేక్షిస్తుంది. వికీపీడియా లాగా మానవ కమ్యూనిటీ ఎడిటర్లకు బదులుగా.. సమాచార వేగాన్ని, స్థిరత్వాన్ని పెంచడానికి ఇది సంపూర్ణంగా AI నిర్వహణ విధానాన్ని అనుసరిస్తుంది. ఈ కొత్త గ్రోకీపీడియా గురించి మస్క్ ఎక్స్ (X) వేదికగా.. “గ్రోకీపీడియా v0.1 దశలోనే వికీపీడియా కంటే మెరుగ్గా ఉంది. దీని వెర్షన్ 1.0 పది రెట్లు అద్భుతంగా ఉంటుంది” అని ధీమా వ్యక్తం చేశారు. లాంచ్ లో భాగంగా xAI భారీ కంప్యూటింగ్ వనరులను ఉపయోగించి సుమారు 885,279 కథనాలను రూపొందించారు.
Grokipedia v0.1 అనే పేరుతో కనిపించే దీని హోమ్‌పేజీ, సాధారణమైన లేఅవుట్‌తో, సులభమైన సెర్చ్ బార్‌తో ఉంటుంది. ఇందులో లభించే సంక్షిప్త, వాస్తవ సారాంశాలు ధృవీకరించబడిన ఆధారాలు, ఎల్లప్పుడూ AI అప్డేట్స్ తో అందుబాటులో ఉంటాయి. ఇందులో వికీపీడియాలో మాదిరిగా యూజర్లు నేరుగా ఆర్టికల్స్‌ను సవరించలేరు. అయితే, గ్రోక్ (Grok) సంభాషణ అసిస్టెంట్ ద్వారా దిద్దుబాట్లు లేదా అప్డేట్స్ కోసం అభ్యర్థనలను సమర్పించవచ్చు. ఇది వాటిని సమీక్షించి, ప్రాసెస్ చేస్తుంది. అంతేకాకుండా, ఈ ప్లాట్‌ఫారమ్ ఫ్రేమ్‌వర్క్ పూర్తిగా ఓపెన్ సోర్స్ గా ఉంది.
Viral Video: పుట్టకు పూజలు, నాగయ్య ప్రత్యక్షం.. కార్తీక సోమవారం నాడు అద్భుత దృశ్యం!
ప్రారంభ గ్రోకీపీడియా కంటెంట్ చాలా వరకు క్రియేటివ్ కామన్స్ ఆట్రిబ్యూషన్ షేర్ అలైక్ 4.0 లైసెన్స్ కింద వికీపీడియా నుండి తీసుకున్నారు. అయితే ఈ ఆర్టికల్స్‌లో ఇన్‌లైన్ సైటేషన్‌లు లేకపోవడంపై కొంతమంది పారదర్శకత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీని లాంచ్ పై ప్రజల స్పందన మిశ్రమంగా ఉంది. కొందరు దీని న్యూట్రల్ టోన్, సంక్షిప్త సమాచారాన్ని అభినందించగా.. మరికొందరు మస్క్ ప్రభావిత ఫ్రేమింగ్‌లు, కీలక వివరాలు లేకపోవడం, AI Bias లేదా అవాస్తవ సమాచారం గురించి సందేహాలు వ్యక్తం చేశారు. అయితే, సరైన కవరేజీని నిర్ధారించడానికి ఈ లాంచ్‌ను ఆలస్యం చేసినట్లు మస్క్ వెల్లడించారు. సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ.. AI ఆధారిత విజ్ఞాన సృష్టిలో ఇది ఒక వినూత్న ప్రయోగంగా చాలా మంది భావిస్తున్నారు. గ్రోకీపీడియా ప్రస్తుతం Grokipedia.comలో అందుబాటులో ఉంది. వినియోగదారులు తమ X ఖాతాలతో సైన్ ఇన్ చేసి బ్రౌజ్ చేయవచ్చు. xAI ఇంకా అధికారిక ఆండ్రాయిడ్ లేదా iOS యాప్‌లను ఇంకా విడుదల చేయలేదు.