Leading News Portal in Telugu

Google launches AI-powered Fitbit Health Coach using Gemini model.. features like Personalized fitness & sleep tracking


Google Fitbit AI-powered personal health coach: కృత్రిమ మేధస్సు (AI) రంగంలో మరో విప్లవాత్మక అడుగు వేస్తూ.. గూగుల్ (Google) సంస్థ ఫిట్‌బిట్‌ (Fitbit) కోసం ప్రత్యేకంగా రూపొందించిన AI ఆధారిత పర్సనల్ హెల్త్ కోచ్ పబ్లిక్ ప్రివ్యూను ప్రకటించింది. గూగుల్ సంబంధించిన జెమిని (Gemini) మోడల్‌ను ఉపయోగించి అభివృద్ధి చేసిన ఈ కోచ్ ఫిట్‌నెస్, నిద్ర, మీ ఆరోగ్యం విషయంలో వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన (Individualized) మద్దతును అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త అనుభవాన్ని విడుదల చేయడానికి ముందు వినియోగదారుల అభిప్రాయాన్ని సేకరించడానికి, వ్యవస్థను మెరుగుపరచడానికి ఈ ప్రివ్యూ దశ వచ్చింది.

CP CV Sajjanar : డీప్‌ఫేక్‌ల యుగంలో ‘సేఫ్‌ వర్డ్‌’ మీ భద్రతకు కవచం

ఫిట్‌బిట్ పర్సనల్ హెల్త్ కోచ్ జెమిని సంభాషణ తెలివితేటలను (Conversational Intelligence) ఉపయోగించి.. వినియోగదారుల ఫిట్‌బిట్ డేటాను అర్థం చేసుకుంటుంది. దీని ద్వారా మెరుగైన సూచనలను అందించి, వ్యక్తిగతీకరించిన చర్యలను సూచిస్తుంది. ప్రారంభ సెటప్ చాలా సులభంగా ఉంటుంది. వినియోగదారులు తమ ఆరోగ్య లక్ష్యాలు, ప్రాధాన్యతలను గురించి టెక్స్ట్ లేదా మైక్రోఫోన్ ద్వారా 5 నుంచి 10 నిమిషాల పాటు సంభాషించాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగా కోచ్ ప్రత్యేకమైన ప్లాన్‌లను రూపొందిస్తుంది. అలాగే కాలక్రమేణా వాటిని అనుగుణంగా మారుస్తుంది.

ప్రధాన ఫీచర్లు:
టుడే డాష్‌బోర్డ్ (Today Dashboard): రోజు నిద్ర లేచిన తర్వాత, వర్కవుట్ పూర్తయిన తర్వాత లేదా నిద్రకు సిద్ధమవుతున్నప్పుడు ఈ విభాగం తక్షణ. సమయానుకూల సమాచారాన్ని అందిస్తుంది.

నిద్ర విశ్లేషణ (Sleep Analysis): ఇది ఫిట్‌బిట్ అత్యంత ఖచ్చితమైన నిద్ర ట్రాకింగ్‌ను పరిచయం చేస్తుంది. నిద్ర నాణ్యత, వ్యవధి, స్థిరత్వంపై కోచ్ వివరాలను అందిస్తుంది.

ఫిట్‌నెస్ ట్రాకింగ్ (Fitness Tracking): వినియోగదారులు వారంవారీ పురోగతిని, వ్యక్తిగతీకరించిన ఫిట్‌నెస్ ప్లాన్‌లను వీక్షించవచ్చు. ఇది వారి కార్డియో లోడ్, కార్యాచరణ స్థాయిలు, అందుబాటులో ఉన్న పరికరాల ఆధారంగా కొత్త రొటీన్‌లను సృష్టించగలదు లేదా పాత వాటిని సవరించగలదు.

హెల్త్ మెట్రిక్స్ హబ్: హార్ట్ రేట్ వేరియబిలిటీ (HRV), రెస్టింగ్ హార్ట్ రేట్, బరువు వంటి ముఖ్యమైన ఆరోగ్య సమాచారం ఒకే డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. కోచ్ డేటా ట్రెండ్‌లను గుర్తించి, కార్డియో లోడ్, నిద్ర నాణ్యత వంటి మెట్రిక్‌ల మధ్య సంబంధాలను హైలైట్ చేస్తుంది.

Ask Coach: ఇక “Ask Coach” బటన్ ద్వారా వినియోగదారులు AIతో ఎప్పుడైనా సంభాషించవచ్చు. ఆరోగ్య, ఫిట్‌నెస్ అంశాలపై ప్రశ్నలు అడగవచ్చు.. అలాగే డేటాను సమీక్షించవచ్చు లేదా వివరణ కోరవచ్చు.

కేవలం రూ.9,999కే ఇంట్లోనే థియేటర్ సెట్.. కొత్త Portronics Beem 550 స్మార్ట్ LED ప్రొజెక్టర్ లాంచ్..!

ఈ ఫిట్‌బిట్ పర్సనల్ హెల్త్ కోచ్ పబ్లిక్ ప్రివ్యూ అక్టోబర్ 28, 2025 నుండి అమెరికాలో అర్హత కలిగిన ఫిట్‌బిట్ ప్రీమియం (Fitbit Premium) వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. ప్రారంభంలో ఆండ్రాయిడ్ పరికరాలతో ప్రారంభించి.. రాబోయే వారాల్లో iOS వినియోగదారులకు కూడా ఈ సేవలను విస్తరించనున్నారు. ప్రారంభ అభిప్రాయాల ఆధారంగా ఈ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తామని గూగుల్ తెలిపింది..