Leading News Portal in Telugu

Affordable Instant Water Heaters in India 2025 | Best Budget Geysers Starting from ₹1,599


Budget Geysers: కాలంతో పాటు మనుషులు కూడా మారుతుంటారు. ఎందుకంటే చలికాలంలో హీట్ వాటర్ లేకుండా స్నానం చేయాలంటే ఏడుపు ఒక్కటే తక్కువ. మరీ ఇప్పుడు శీతాకాలం మొదలైంది. రాబోయే రోజుల్లో తీవ్రమైన చలి నుంచి రక్షించడానికి మీ ఇంట్లో వాటర్ హీటర్ ఉందా. చలికాలంలో వేడి నీళ్లు లేకుండా స్నానం చేయగలిగే వాళ్లు చాలా అరుదు. వాస్తవానికి శీతాకాలంలో వేడి నీళ్లతో స్నానం చేయకపోతే అనేక అనారోగ్యాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ స్టోరీలో చౌకైన గీజర్లు గురించి తెలుసుకుందాం.

READ ALSO: కేవలం రూ.9,999కే ఇంట్లోనే థియేటర్ సెట్.. కొత్త Portronics Beem 550 స్మార్ట్ LED ప్రొజెక్టర్ లాంచ్..!

కొన్ని సరసమైన గీజర్ ఎంపికలు..

యాక్టివా ఇన్‌స్టంట్ వాటర్ హీటర్ గీజర్: యాక్టివా ఇన్‌స్టంట్ వాటర్ హీటర్ గీజర్ అమెజాన్ ఇండియాలో కేవలం రూ.1,599 కు లభిస్తుంది. 3 KVA ఎలిమెంట్‌తో వస్తున్న ఈ గీజర్ ఇంట్లో ఇన్‌స్టాల్ చేయడం చాలా సులభం. గీజర్‌తో వచ్చిన జాబితా చేసిన వివరాల ప్రకారం దానిని ఇన్‌స్టాల్ చేస్తే సరిపోతుంది. ఈ గీజర్ 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది.

GM ఫోగో నుంచి ఇన్‌స్టంట్ గీజర్ : GM ఫోగో బ్రాండ్ ఇన్‌స్టంట్ గీజర్‌ను అందిస్తుంది. దీని ధర అమెజాన్ ఇండియాలో రూ.2,199 గా ఉంది. ఇది 3-లీటర్ సామర్థ్యంతో వస్తుంది. ఇది అధునాతన 3-స్థాయి భద్రతను ఉపయోగిస్తుందని కంపెనీ తెలిపింది.

V-గార్డ్ ఇన్‌స్టంట్ గీజర్ : V-గార్డ్ ఇన్‌స్టంట్ గీజర్ అమెజాన్‌లో రూ.2,649 కు లభిస్తుంది. ఇది 3-లీటర్ సామర్థ్యం కలిగి ఉందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ గీజర్ తెలుపు, నీలం రంగులలో లభిస్తుంది. దీనికి 2 సంవత్సరాల వారంటీ లభిస్తుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

ఓరియంట్ ఎలక్ట్రిక్ గీజర్: అమెజాన్‌లో ఓరియంట్ ఎలక్ట్రిక్ ఇన్‌స్టంట్ గీజర్‌ను అందుబాటులో ఉంచింది. దీనిని ఓరియంట్ ఎలక్ట్రిక్ ఆరా రాపిడ్ ప్రో అని పిలుస్తారు. ఇది 5.9-లీటర్ సామర్థ్యంతో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. ఇందులో 3000W హీటింగ్ ఎలిమెంట్‌ను ఉపయోగిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఇంతకీ ఇన్‌స్టంట్ గీజర్‌లు అంటే ఏంటో తెలుసా.. ఇన్‌స్టంట్ గీజర్‌లు అంటే నీటిని తక్షణమే వేడి చేస్తాయి. అవి ఒక చిన్న ట్యాంక్, శక్తివంతమైన హీటింగ్ ఎలిమెంట్‌ను ఉపయోగిస్తాయి. ఇన్‌స్టంట్ గీజర్లు నీటిని తక్షణమే వేడి చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO: Bangladesh: భారత శత్రువులకు బంగ్లాదేశ్ ‘‘రెడ్ కార్పెట్’’.. జకీర్ నాయక్, హఫీస్ సయీద్, పాక్ ఆర్మీకి వెల్‌కమ్..