Portronics Beem 550: కాంపాక్ట్ పోర్టబుల్ ప్రొజెక్టర్ల శ్రేణిని పెంచే పనిలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ పోర్ట్రానిక్స్ (Portronics) సరికొత్త బీమ్ 550 (Beem 550) స్మార్ట్ LED ప్రొజెక్టర్‌ను విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లు, ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చిన ఈ ప్రొజెక్టర్ కేవలం రూ.9,999కే లభించడం వినియోగదారులకు శుభవార్త అనే చెప్పాలి.
బీమ్ 550 ప్రొజెక్టర్ 720p (1280×720) రిజల్యూషన్‌ను కలిగి ఉండగా.. 1080p ఇన్పుట్ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీని 6000 ల్యూమెన్స్ బ్రైట్నెస్ వల్ల పగటిపూట గది వెలుతురులో కూడా స్పష్టమైన, క్లీన్ విజువల్స్‌ను చూపిస్తుంది. ఇది గరిష్టంగా 100 అంగుళాల వరకు స్క్రీన్ ప్రొజెక్ట్ చేయగల ఈ డివైజ్ 2000:1 కాంట్రాస్ట్ రేషియోను అందిస్తుంది. దీని LED ల్యాంప్ 40,000 గంటల దీర్ఘకాలిక వినియోగాన్నీ అందిస్తుంది.
Hero Electric Bike: హీరో తొలి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది.. 200cc బైకుకు సమానమైన రేంజ్ లో

ఇక దీని సెటప్ విషయానికి వస్తే.. పోర్ట్రానిక్స్ ఈ ప్రొజెక్టర్‌లో ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్ కరెక్షన్ ఫీచర్లను అందించింది. దీని వల్ల ఇమేజ్ షార్ప్ నెస్, అలైన్మెంట్ ఆటోమేటిక్‌గా సర్దుబాటు అవుతుంది. కాంపాక్ట్, మడతపెట్టే డిజైన్‌తో ఉన్న ఈ ప్రొజెక్టర్‌ను ఎక్కడైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. అంతేకాదండోయ్.. టెలిస్కోపిక్ మోనోపాడ్ స్టాండ్ ద్వారా ఎత్తు, యాంగిల్ సర్దుబాటు చేసుకునే సౌకర్యం కూడా ఉంది. టేబుల్‌పై, గోడపై లేదా సీలింగ్‌లో అమర్చుకునే వెసులుబాటు దీనికి ప్రత్యేకత.

దీని సాఫ్ట్వేర్ పరంగా చూస్తే.. బీమ్ 550 ఆండ్రాయిడ్ టీవీ OS పై రన్ అవుతుంది. దీనివల్ల నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి ప్రముఖ OTT యాప్‌లను నేరుగా యాక్సెస్ చేయవచ్చు. కనెక్టివిటీ కోసం డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0, HDMI, USB, AUX పోర్టులు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లేదా గేమింగ్ కన్సోల్‌లను సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. వీటితోపాటు 5W బాటమ్-మౌంటెడ్ స్పీకర్ ద్వారా స్పష్టమైన ఆడియో అవుట్‌పుట్ లభిస్తుంది.
The Great Pre Wedding Show: ఆసక్తికరంగా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్
బీమ్ 550లో 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. దీని అసలు ధర రూ.19,999 కాగా.. ప్రస్తుతం ప్రత్యేక ప్రారంభ ధర కింద కేవలం 9,999కే అందుబాటులో ఉంది. వినియోగదారులు దీన్ని Portronics.com, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఏడాది వారంటీతో వస్తున్న ఈ ప్రొజెక్టర్ తక్కువ ధరలో అధిక బ్రైట్నెస్, స్మార్ట్ ఫీచర్లు కోరుకునే వారికి ఒక సరైన ఎంపికగా నిలుస్తుంది.
