Leading News Portal in Telugu

Motorola Edge 70 Launch: Ultra-Slim 5.99mm Design, Snapdragon 7 Gen 4, Triple 50MP Cameras Revealed


Motorola Edge 70: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి మోటరోలా (Motorola) సిద్ధమైంది. ఈసారి మిడ్‌రేంజ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 70 (Motorola Edge 70)ను నవంబర్ 5న లాంచ్ చేయనుంది. స్టైల్, పర్ఫామెన్స్, మంచి బ్యాటరీ లైఫ్‌తో ఈ ఫోన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మొబైల్ డిజైన్ పరంగా చూస్తే.. ఎడ్జ్ 70 ప్రధాన ఆకర్షణ దాని సన్నని సైజు. కేవలం 5.99mm మందంతో ఇది ఇప్పటివరకు మోటరోలా రూపొందించిన అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుంది. అంతేకాకుండా ఈ సన్నని బాడీ లోపల 4,800mAh సామర్థ్యం గల సిలికాన్ కార్బన్ బ్యాటరీని సమీకరించారు. ఇది ఐఫోన్ ఎయిర్ (3,149mAh), గెలాక్సీ S25 ఎడ్జ్ (3,900mAh) కంటే చాలా ఎక్కువ. అలాగే 68W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉండడం విశేషం. ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

లాంచ్ కు ముందే Nothing Phone (3a) Lite ధర, ఫుల్ ఫీచర్స్ లీక్..!

ఇక పనితీరు విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 12GB LPDDR5X ర్యామ్, 512GB వరకు UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్లతో లభించనుంది. గీక్‌బెంచ్ 6 స్కోర్ల ప్రకారం దీని పనితీరు ఎడ్జ్ 60 ప్రోలోని మీడియాటెక్ డైమెన్సిటీ 8350తో సమానంగా ఉందని తెలుస్తోంది. డిస్‌ప్లే పరంగా ఇందులో 6.7 అంగుళాల 1.5K pOLED ప్యానెల్ ఉండి 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. దీన్ని గొరిల్లా గ్లాస్ 7i రక్షిస్తుంది. కెమెరా సెటప్‌లో కూడా మోటరోలా ఎడ్జ్ 70 ఆకట్టుకునేలా ఉంది. వెనుక భాగంలో డ్యూయల్ 50MP కెమెరాలు (ప్రధాన + అల్ట్రావైడ్) ఉండగా.. ముందు భాగంలో 50MP ఫ్రంట్ కెమెరాని అందించారు. ధర పరంగా, చైనాలో ఈ ఫోన్‌ను Moto X70 Air పేరుతో విడుదల చేసారు. 12GB + 256GB మోడల్‌ ధర రూ.32,300 (2,599 యువాన్‌), 12GB + 512GB మోడల్‌ ధర రూ.36,000 (2,899 యువాన్‌). అయితే ప్రారంభ ఆఫర్‌లలో దీన్ని వరకు తగ్గించే అవకాశం ఉంది.

Delhi Vehicle Ban: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఆ వాహనాలపై నిషేధం.. ఎందుకంటే?