Nothing Phone (3a) Lite: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రత్యేక డిజైన్, ఇన్నోవేషన్‌తో గుర్తింపు పొందిన నథింగ్ (Nothing) సంస్థ తన కొత్త మోడల్ నథింగ్ ఫోన్ (3a) లైట్ ను అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమైంది. లాంచ్‌కు ఒక్కరోజు ముందు, ఈ ఫోన్‌కి సంబంధించిన భారతీయ ధరతో పాటు మరికొన్ని ఫీచర్స్ ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. అందిన సమాచారం ప్రకారం నథింగ్ ఫోన్ (3a) లైట్ ఒకే వేరియంట్‌లో 8GB RAM + 128GB స్టోరేజ్ తో మార్కెట్‌లోకి రానుంది. దీని లీకైన ధర రూ.18,999గా ఉండవచ్చని సమాచారం.
EPFO Latest Update: ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. కోటి మందికిపైగా ప్రయోజనం
ఇక మొబైల్ రంగుల విషయానికి వస్తే.. నలుపు (Black), తెలుపు (White) ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్ అక్టోబర్ 29న లాంచ్ అవుతున్నప్పటికీ.. విక్రయాలు మాత్రం నవంబర్ 4 నుండి ప్రారంభం కానున్నాయి. అయితే భారతీయ లాంచ్ తేదీ, టైమ్‌లైన్ గురించి కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇక డిజైన్ పరంగా చూస్తే.. నథింగ్ ఫోన్ (3a) లైట్‌లో గ్లిఫ్ లైట్ సిస్టమ్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. గత మోడళ్లలో ఉన్న కెమెరా చుట్టూ LED స్ట్రిప్‌లకు బదులుగా.. ఈ ఫోన్‌లో కుడి వైపు మూలలో కేవలం ఒకే డాట్ LED మాత్రమే ఉంది. “Light up the everyday” అనే ట్యాగ్‌లైన్ ప్రకారం.. ఈ సింప్లిఫైడ్ గ్లిఫ్ లైట్ ప్రధానంగా ఛార్జింగ్ స్టేటస్ లేదా నోటిఫికేషన్ల వంటి ప్రాథమిక పనులకు మాత్రమే ఉపయోగపడవచ్చు.
Droupadi Murmu: రేపు రాఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణించనున్న సుప్రీం కమాండర్..
ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే నథింగ్ ఫోన్ (3a) లైట్ బడ్జెట్ సెగ్మెంట్‌లో ఉన్నప్పటికీ ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుందని అంచనా. ఇందులో 6.77 అంగుళాల FHD+ AMOLED LTPS డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తుంది. ఇది MediaTek Dimensity 7300 Pro చిప్‌సెట్ తో పని చేస్తుంది. ఇక పవర్ కోసం 5000mAh బ్యాటరీతో పాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. కెమెరా విభాగంలో 50MP మెయిన్ లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ వెనుక భాగంలో ఉండగా, ముందువైపు 32MP ఫ్రంట్ కెమెరా అందించబడే అవకాశం ఉంది. ఇది 4K వీడియో రికార్డింగ్ (30fps)ను సపోర్ట్ చేస్తుందని కూడా అంచనా. స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 5, IP64 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్ ఫీచర్లు ఉండనున్నాయి.
Phone (3a) Lite. 29.10. 13.00 GMT.
Light up the everyday. pic.twitter.com/VVNclQ6mEl
— Nothing (@nothing) October 27, 2025