Leading News Portal in Telugu

Oppo Find X9 Pro Launched Globally with 200MP Camera, 7500mAh Battery & 6 Years Security Updates


Oppo Find X9 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో, తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఫైండ్ X9 ప్రో (Oppo Find X9 Pro)ను తాజాగా బార్సిలోనాలో జరిగిన హార్డ్‌వేర్ లాంచ్ ఈవెంట్‌లో గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. చైనాలో అక్టోబర్ 16న విడుదలైన ఈ ఫోన్, గ్లోబల్ మార్కెట్‌లోనూ అదే ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ఇక ఈ ఫైండ్ X9 ప్రో త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా అడుగు పెట్టనుంది. ఇక మరి ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ను చూసేద్దామా..

ఈ కొత్త ప్పో ఫైండ్ X9 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 3nm MediaTek Dimensity 9500 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజ్‌తో లాంచ్ అయ్యింది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఈ ఫోన్‌కు ఐదు ప్రధాన OS అప్‌డేట్‌లు, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కంపెనీ హామీ ఇచ్చింది. ఇక ఇందులో అధునాతన 36,344.4 చ.మి.మీ. విస్తీర్ణం గల వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ వేడి నియంత్రణను సమర్థవంతంగా నిర్వహిస్తుంది.

TRAI: స్పామ్ కాల్స్‌కు చెక్.. ఇకపై నంబర్‌తో పాటు పేరు కూడా.. అందుబాటులోకి CNAP సేవలు..!

Image (2)

ఇక డిజైన్ విషయానికి వస్తే.. 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది. ఇది 1,272×2,772 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 అందించబడింది. అంతేకాకుండా 2,160Hz PWM డిమ్మింగ్, DC డిమ్మింగ్, డాల్బీ విజన్, HDR10+, HDR వివిడ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌కి TUV Rheinland Intelligent Eye Care 5.0 మరియు SGS డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్లు లభించాయి. ధూళి, నీటి నిరోధకత కోసం IP66, IP68, IP69 రేటింగ్‌లను పొందింది.

మొబైల్ బ్యాటరీ పరంగా చూస్తే.. 7,500mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ దీని ప్రత్యేకత. దీనికి 80W SuperVOOC వైర్డ్ ఛార్జింగ్, 50W AirVOOC వైర్‌లెస్ ఛార్జింగ్, అలాగే 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కెమెరా విభాగంలో హాసెల్‌బ్లాడ్‌తో భాగస్వామ్యంతో రూపొందించిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Sony LYT-828 ప్రైమరీ కెమెరా (OIS‌తో), 50MP సామ్ సంగ్ ISOCELL 5KJN5 అల్ట్రావైడ్ కెమెరా, 200MP టెలిఫోటో కెమెరా (OIS‌తో) ఉన్నాయి. ముందు భాగంలో 50MP Samsung 5KJN5 సెల్ఫీ కెమెరా (f/2.0 అపెర్చర్) కలదు.

India vs Australia 1st T20: భారత్, ఆసీస్ తొలి టీ20 వర్షార్పణం..!

కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 6.0, Wi-Fi 7, AI LinkBoost, USB 3.2 Gen 1 Type-C వంటి ఆధునిక సాంకేతికతలు ఉపయోగించారు. భద్రత కోసం 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించబడింది. ఇక చివరగా ధర విషయానికి వస్తే.. Oppo Find X9 Pro 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌ ధర 1,299 యురోస్ (భారత కరెన్సీలో రూ. 1,34,000). ఇది సిల్క్ వైట్, టైటానియం చార్‌కోల్ రంగుల్లో లభిస్తుంది. గ్లోబల్‌గా ఈ ఫోన్ కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకాలు జరగనున్నాయి.