OPPO Find X9: ఒప్పో (OPPO) తాజాగా ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో భాగంగా ‘ఒప్పో ఫైండ్ X9’ (OPPO Find X9) స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచ మార్కెట్లలో అధికారికంగా లాంచ్ చేసింది. అంతకుముందు చైనాలో విడుదలైన ఈ ఫోన్, ఇప్పుడు గ్లోబల్ కస్టమర్ల కోసం అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. హాసెల్‌బ్లాడ్ (Hasselblad) భాగస్వామ్యంతో రూపొందించిన న్యూ-జెనరేషన్ కెమెరా సిస్టమ్, మంచి పనితీరు మరియు అధునాతన బ్యాటరీ టెక్నాలజీతో ఈ హ్యాండ్‌సెట్ ప్రత్యేకంగా నిలుస్తుంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన పూర్తి వివరాలను చూసినట్లయితే..
Cyclone Montha: మరో 48 గంటలు జాగ్రత్త.. జిల్లా కలెక్టర్లకు మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు
OPPO Find X9 స్మార్ట్ ఫోన్ కెమెరా సెగ్మెంట్‌లో ఫైండ్ X9 కొత్త ప్రమాణాలు సెట్ చేస్తోంది. ఇది ట్రిపుల్ 50MP కెమెరా సెటప్‌తో వస్తుంది. 50MP ప్రొ-లెవెల్ మెయిన్ కెమెరా (f/1.6)తో 1/1.4-అంగుళాల సోనీ LYT-808 సెన్సార్ ఉపయోగించబడింది. అలాగే 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 3x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (LYT600 సెన్సార్‌తో) కూడా అందుబాటులో ఉన్నాయి. వీడియో సెగ్మెంట్‌లో 4K 120fps Dolby Vision HDR రికార్డింగ్, 4K మోషన్ ఫోటోస్ సపోర్ట్ ఉన్నాయి.

ఫైండ్ X9 కేవలం 7.99mm మందంలోనే 7025mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. మూడవ తరం సిలికాన్-కార్బన్ టెక్నాలజీతో రూపొందించబడిన ఈ బ్యాటరీ ఐదు సంవత్సరాల తర్వాత కూడా 80% సామర్థ్యాన్ని నిలుపుకుంటుందని ఒప్పో చెబుతోంది. అంతేకాకుండా ఇది 80W SUPERVOOC వైర్డ్ ఛార్జింగ్, 50W AIRVOOC వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. డిస్‌ప్లే పరంగా.. 6.59 అంగుళాల 120Hz AMOLED ఫ్లాట్ స్క్రీన్ అందించబడింది. దీని పీక్ బ్రైట్‌నెస్ 3600 నిట్స్ వరకు ఉంటుంది. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కలిగి ఉంది. పనితీరు విషయంలో ఇది TSMC 3nm ప్రాసెస్‌పై రూపొందించబడిన MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌తో నడుస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16తో వస్తుంది.
ఆరేళ్ళ సెక్యూరిటీ అప్‌డేట్స్, 200MP కెమెరా, 7500mAh భారీ బ్యాటరీతో Oppo Find X9 Pro లాంచ్.. ధర ఎంతంటే..?
ఈ ఫోన్ 12GB/16GB LPDDR5X ర్యామ్, 256GB లేదా 512GB UFS 4.1 స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. వీటితోపాటు IP66, IP68, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌లతో మరింత మన్నికగా ఉంటుంది. ఇక ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, USB Type-C 3.2 Gen 1 పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ధర విషయానికి వస్తే 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌కి 999 యూరోలు (రూ. 1,02,750)గా నిర్ణయించారు. ఈ ఫోన్ స్పేస్ బ్లాక్, వెల్వెట్ రెడ్, టైటానియం గ్రే రంగులలో లభిస్తుంది. గ్లోబల్ మార్కెట్‌లో నవంబర్ ప్రారంభం నుంచే అమ్మకాలు మొదలవుతాయి. అలాగే నవంబర్‌లోనే భారత మార్కెట్‌లో కూడా లాంచ్ కానుందని ఒప్పో తెలిపింది.