Leading News Portal in Telugu

Nothing Phone (3a) Lite Launched with 6.77-inch FHD+ AMOLED Display, 50MP Camera, and IP54 Rating


Nothing Phone 3a Lite: నథింగ్ (Nothing) సంస్థ 3 సిరీస్‌లో మరో కొత్త వేరియంట్‌గా “నథింగ్ ఫోన్ (3a) లైట్”ను అధికారికంగా విడుదల చేసింది. యూరప్, యూకేలో ఇప్పటికే లాంచ్ అయిన ఈ ఫోన్, త్వరలోనే భారత మార్కెట్లో కూడా విడుదల కానుంది. సరసమైన ధరలో ప్రీమియం అనుభూతిని అందించే లక్ష్యంతో ఈ ఫోన్‌ను బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ కేటగిరీలోకి తీసుకొచ్చారు. ఈ ఫోన్ MediaTek Dimensity 7300 Pro (4nm) ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 120fps గేమింగ్‌ సపోర్ట్‌తో లభిస్తుంది. 8GB LPDDR4X ర్యామ్, అదనంగా 8GB వరకు వర్చువల్ ర్యామ్ తోపాటు.. 256GB వరకు UFS 2.2 స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మైక్రోSD స్లాట్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించవచ్చు.

55dB ANC, 45 గంటల బ్యాటరీ లైఫ్, ప్రీమియం ఆడియో అనుభవంతో OPPO Enco X3s లాంచ్..!

డిస్‌ప్లే పరంగా ఇందులో 6.77 అంగుళాల FHD+ 120Hz Super AMOLED స్క్రీన్ ఉంది. ఇది 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అద్భుతమైన విజువల్ అనుభూతిని అందిస్తుంది. 2160Hz PWM డిమ్మింగ్‌ టెక్నాలజీ, పాండా గ్లాస్ రక్షణ, IP54 రేటింగ్‌ ఈ ఫోన్‌కు మన్నికను ఇస్తాయి. ఇక కెమెరా విభాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్ (Samsung), 8MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో లెన్స్‌లతో అద్భుతమైన ఫోటోగ్రఫీ అనుభవం అందిస్తుంది. అలాగే ఫ్రంట్‌లో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 4K 30fps వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ సామర్థ్యం 5000mAh కాగా, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అయితే ప్యాకేజింగ్‌లో ఛార్జర్ ఇవ్వక పోవడం గమనార్హం.

IP66+IP68+IP69 రేటింగ్స్, 50MP ట్రిపుల్ కెమెరా, 7025mAh బ్యాటరీతో OPPO Find X9 లాంచ్..!

ఇక సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే.. ఈ ఫోన్ Android 15 ఆధారిత Nothing OS 3.5 తో పనిచేస్తుంది. 3 ప్రధాన OS అప్‌డేట్‌లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌ల హామీ ఉంది. అంతేకాకుండా ఇందులో “Essential Space” అనే AI ఆధారిత ఫీచర్ ఉంది. ఇది నోట్స్ రాయడానికి, ఆలోచనలను రికార్డ్ చేయడానికి, కంటెంట్‌ను త్వరగా క్యాప్చర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక ధర విషయానికి వస్తే నథింగ్ ఫోన్ (3a) లైట్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 8GB + 128GB మోడల్ ధర 249 యూరోలు (రూ.25,560) కాగా, 8GB + 256GB మోడల్ ధర 279 యూరోలు (రూ.28,640)గా ఉంది. ఇది తెలుపు, నలుపు ఆప్షన్లలో లభిస్తుంది.