OPPO Enco X3s: ఒప్పో ఫైండ్ X9 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ తోపాటు, ఒప్పో సంస్థ తమ సరికొత్త ఇన్ ఇయర్ TWS ఇయర్‌బడ్స్ “ఒప్పో ఎన్‌కో X3s” (OPPO Enco X3s)ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. అధిక నాణ్యత గల ఆడియో, బలమైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్లు, AI స్మార్ట్ టెక్నాలజీతో ఈ ఇయర్‌బడ్స్ ప్రీమియం వినియోగదారుల కోసం రూపొందించబడ్డాయి. ఈ ఎన్‌కో X3s లో స్పష్టమైన, లోతైన శబ్దాన్ని అందించేందుకు 6mm ఫ్లాట్ డయాఫ్రామ్ యూనిట్ (హై ఫ్రీక్వెన్సీ కోసం), 11mm కాంపోజిట్ వూఫర్ (లో ఫ్రీక్వెన్సీ కోసం) డ్యూయల్ డ్రైవర్ సిస్టమ్ ఉంది. ఇవి LHDC 5.0 కోడెక్ సపోర్ట్‌తో Hi-Res ఆడియో సర్టిఫికేషన్‌ను పొందాయి. ప్రముఖ ఆడియో బ్రాండ్ డైనాడియో (Dynaudio) సహకారంతో రూపొందించిన ప్రత్యేక “డైనాడియో ఫీచర్డ్ సౌండ్ ప్రొఫైల్” సహజమైన శబ్ద అనుభవాన్ని అందిస్తుంది.
IP66+IP68+IP69 రేటింగ్స్, 50MP ట్రిపుల్ కెమెరా, 7025mAh బ్యాటరీతో OPPO Find X9 లాంచ్..!
నాయిస్ క్యాన్సిలేషన్ పరంగా.. ఈ ఇయర్‌బడ్స్ గరిష్టంగా 55dB ANC అందిస్తాయి. 5500Hz అల్ట్రా-వైడ్ ఫ్రీక్వెన్సీ రేంజ్‌తో పాటు.. “రియల్-టైమ్ డైనమిక్ ANC” టెక్నాలజీ ద్వారా చుట్టూ ఉన్న శబ్దాన్ని బట్టి ఆటోమేటిక్‌గా క్యాన్సిలేషన్ స్థాయిని సర్దుబాటు చేస్తుంది. స్మార్ట్ ఫీచర్లలో AI ట్రాన్స్‌లేట్ (రియల్ టైమ్ అనువాదం) ముఖ్యమైనది. ఇది ColorOS 15.0.1 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఎంపిక చేసిన ఒప్పో పరికరాలలో మాత్రమే పనిచేస్తుంది. ట్రిపుల్ మైక్రోఫోన్ సిస్టమ్‌తో AI క్లియర్ కాల్స్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.

ఆరేళ్ళ సెక్యూరిటీ అప్‌డేట్స్, 200MP కెమెరా, 7500mAh భారీ బ్యాటరీతో Oppo Find X9 Pro లాంచ్.. ధర ఎంతంటే..?
బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే.. ANC ఆఫ్ చేసినప్పుడు ఇయర్‌బడ్స్‌తో 11 గంటల ప్లేబ్యాక్, ఛార్జింగ్ కేస్‌తో కలిపి 45 గంటల బ్యాకప్ లభిస్తుంది. ANC ఆన్ చేసినప్పుడు, ఇయర్‌బడ్స్‌తో 6 గంటలు, కేస్‌తో కలిపి 24 గంటలు పని చేస్తాయి. ఇవి బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ, IP55 రేటింగ్, టచ్ కంట్రోల్స్, HeyMelody యాప్ అనుకూలత వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఒప్పో ఎన్‌కో X3s ధర EUR 129 (రూ. 13,265)గా నిర్ణయించారు. ప్రస్తుతం యూరప్, సింగపూర్‌లో అందుబాటులో ఉన్న ఈ ఇయర్‌బడ్స్ త్వరలో ఇతర దేశాల్లోనూ లాంచ్ కానున్నాయి.