Leading News Portal in Telugu

BSNL Prepaid Plans: 6-Month and Annual Plans Starting at 897.. it Cheaper Than Jio and Airtel


BSNL: బిఎస్‌ఎన్‌ఎల్ (BSNL) ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టిన చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు టెలికాం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) వంటి ప్రముఖ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల కస్టమర్లను ఆశ్చర్యపరిచే విధంగా బిఎస్‌ఎన్‌ఎల్ తక్కువ ధరల్లోనే దీర్ఘకాల వ్యాలిడిటీతో కూడిన ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తోంది. వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ వంటి ముఖ్యమైన సేవలను సౌకర్యవంతంగా ఉపయోగించుకునే వీలును కల్పిస్తూ.. ఆరు నెలల నుంచి ఏడాది వరకు గల ప్లాన్‌లను అతి తక్కువ ధరల్లో లాంచ్ చేసింది. ముఖ్యంగా 6 నెలల ప్లాన్ నెలకు కేవలం రూ.150 ఖర్చుతో లభించడం వినియోగదారులను ఆకర్షిస్తోంది.

Yuvraj Singh: ఐపీఎల్‌లో చీఫ్ కోచ్‌గా మారబోతున్న యువరాజ్ సింగ్ .. ఏ జట్టుకో తెలుసా!

897 ప్రీపెయిడ్ ప్లాన్:
బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న 897 ప్రీపెయిడ్ ప్లాన్ 180 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో రోజువారీ డేటా పరిమితి లేకుండా మొత్తం 90 GB డేటా లభిస్తుంది. అంటే వినియోగదారుడు తన అవసరానికి అనుగుణంగా ఎప్పుడైనా డేటాను ఉపయోగించుకోవచ్చు. 90 GB పూర్తయిన తర్వాత 40 Kbps వేగంతో పోస్ట్-డేటా లభిస్తుంది. దీనితోపాటు అపరిమిత లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. మొత్తంగా తరచుగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా దీర్ఘకాలిక ఉపయోగం కోరుకునే వారికి ఇది అత్యుత్తమ ఎంపిక.

1999 వార్షిక ప్లాన్:
వార్షిక ప్లాన్ కావాలనుకునే వినియోగదారుల కోసం బిఎస్‌ఎన్‌ఎల్ రూ.1999 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌కు 330 రోజుల వ్యాలిడిటీ ఉంది. ఇందులో రోజుకు 1.5 GB డేటా లభిస్తుంది. ఈ డేటా అయ్యాక తర్వాత వేగం 40 Kbps కు తగ్గుతుంది. వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు అపరిమితంగా ఉపయోగించుకోవచ్చు. బిఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలు అందుబాటులోకి రావడంతో ఈ ప్లాన్ ఇప్పుడు మరింత విలువైనదిగా మారింది.

Aadhar Card Update: నవంబర్ 1 నుంచి ఆధార్‌లో కీలక మార్పులు.. అవేంటంటే..?

2399 వార్షిక ప్లాన్:
ఇక పూర్తిస్థాయి ఏడాది వ్యాలిడిటీ కోరుకునేవారికి రూ.2399 ప్లాన్ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తోంది. ఇది 365 రోజులపాటు చెల్లుతుంది. ఈ ప్లాన్‌లో రోజూ 2 GB డేటా లభించడంతో పాటు, అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. మార్కెట్లోని ఇతర కంపెనీలతో పోలిస్తే బిఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్‌ను చాలా తక్కువ ధరకే అందిస్తోంది.