Leading News Portal in Telugu

iQOO Neo11 Launched with Snapdragon 8 Elite, 7500mAh Battery and 100W Fast Charging.. Full Specs & Prices are


iQOO Neo11: iQOO సంస్థ కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Neo11 ను విడుదల చేసింది. గేమింగ్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్‌ స్థాయి పనితీరు, పెద్ద బ్యాటరీ సామర్థ్యం, అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీతో కొత్త ప్రమాణాలను సృష్టించనుంది. ఈ కొత్త iQOO Neo11 లో 6.82 అంగుళాల 2K+ (3168×1440 పిక్సెల్స్) LTPO AMOLED స్క్రీన్ ఉంది. ఇది BOE Q10+ మెటీరియల్ తో రూపొందించబడింది. 1Hz నుండి 144Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్ అందించడంతో పాటు.. 4500 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఉంటుంది. దీని వల్ల సూర్య కాంతిలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రాసెసింగ్ శక్తికి వస్తే.. ఈ ఫోన్‌లో Snapdragon 8 Elite (3nm) చిప్‌సెట్ ఉపయోగించబడింది. ఇది AnTuTu బెంచ్‌మార్క్‌లో 3.54 మిలియన్ పాయింట్లు సాధించింది. అంతేకాకుండా Q2 గేమింగ్ చిప్ గేమ్ గ్రాఫిక్స్, ఫ్రేమ్‌ రేట్లను మరింత స్మూత్‌గా చేస్తుంది. ఇక ర్యామ్, స్టోరేజ్ పరంగా చూస్తే.. ఇది 16GB LPDDR5X Ultra (9600Mbps) ర్యామ్ వరకు, అలాగే 1TB వరకు UFS 4.1 స్టోరేజ్‌తో వస్తుంది. 3200Hz టచ్ సాంప్లింగ్ రేట్ కలిగిన సూపర్ సెన్సిటివ్ టచ్ చిప్ గేమింగ్ రిస్పాన్స్ టైమ్‌ను గణనీయంగా తగ్గిస్తుంది.

Justice Surya Kant: భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్..

ఇక ఈ మొబైల్ లో ప్రత్యేకంగా చెప్పాల్సింది కూలింగ్ టెక్నాలజీ. ఎక్కువ సేపు గేమింగ్‌లో ఫోన్ వేడెక్కకుండా ఉండేలా iQOO Neo11 లో అద్భుతమైన హీట్ డిసిపేషన్ సిస్టమ్ పొందుపరచబడింది. దీని హీట్ డిసిపేషన్ ఏరియా 8000mm² వరకు ఉండగా, అల్ట్రా హై థర్మల్ కండక్టివిటీ గ్రాఫైట్ లేయర్ (2000W/m·K) ఉపయోగించారు. ఇది కేవలం 10 సెకన్లలో 15°C వరకు ఉష్ణోగ్రత తగ్గించే సామర్థ్యంతో ఈ ఫోన్ గేమింగ్ సెషన్లలోనూ కూల్‌గా ఉంటుంది. ఇక iQOO Neo11లో 7500mAh సింగిల్ సెల్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంది. పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, ఫోన్ బరువు తక్కువగా ఉంటుంది. అలాగే 100W ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్‌తో కేవలం 3 నిమిషాల ఛార్జ్‌తో 2 గంటల వీడియో చూడవచ్చు.

Image (1) (1)

ఇక కెమెరా విభాగంలో ఫోన్ వెనుక 50MP సోనీ LYT700V సెన్సార్ తో కూడిన మెయిన్ కెమెరా ఉంది. దీనికి OIS మద్దతు ఉంది. అలాగే 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 16MP ఫ్రంట్ కెమెరా సల్ఫీ లవర్స్ కోసం అందించారు. ఇక డిజైన్ పరంగా స్విఫ్ట్ బ్లాక్ వెర్షన్ ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం అల్లాయ్‌తో తయారు చేయబడింది. వీటితోపాటు IP68 + IP69 రేటింగ్ కలిగి ఉండటంతో నీరు, ధూళి నుంచి రక్షణను అందిస్తుంది.

Google AI Pro: జియో కస్టమర్లకు ముఖేష్ అంబానీ క్రేజీ గిఫ్ట్.. రూ.35,100 విలువైన గూగుల్ AI ప్రో ఉచితంగా..

iQOO Neo11 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OriginOS 6 పై నడుస్తుంది. ఇది ప్రీమియమ్‌ పనితీరుతో పాటు ఆధునిక ఫీచర్లను అందించే ఫోన్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం చైనాలో అమ్మకానికి లభ్యమవుతున్న ఈ డివైస్‌ వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 12GB RAM + 256GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర ¥2599 (రూ.32,460)గా నిర్ణయించగా, 16GB + 256GB మోడల్‌ ధర ¥2899 (రూ.36,210)గా ఉంది. ఇక 12GB + 512GB వేరియంట్‌ కోసం ¥2999 (రూ.37,460)గా నిర్ణయించారు. అలాగే 16GB + 512GB వేరియంట్‌ ధర ¥3299 (రూ.41,210) కాగా, టాప్ వేరియంట్ 16GB + 1TB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర ¥3799 (రూ.47,455)గా ఉంది.

Image