- ‘ఐకూ’ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల
- మిడ్-రేంజ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఐకూ 11 రిలీజ్
- త్వరలోనే భారతదేశంలో కూడా లాంచ్
- ఐకూ 11 స్మార్ట్‌ఫోన్‌ను చూస్తుంటేనే కొనాలనిపిస్తోంది
చైనాకు చెందిన వివో సబ్‌బ్రాండ్ ‘ఐకూ’ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. మిడ్-రేంజ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఐకూ 11 గురువారం రిలీజ్ అయింది. త్వరలోనే భారతదేశంలో కూడా లాంచ్ కావచ్చు.

ఐకూ 11 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వచ్చింది. 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో 6.82-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఐకూ 11 ఫోన్ ఆండ్రాయిడ్ 16 OriginOS 6 పై రన్ అవుతుంది. గేమింగ్ కోసం Q2 చిప్‌ను కూడా కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెకండరీ లెన్స్‌తో వచ్చింది. 16MP ఫ్రంట్ కెమెరా ఉంది.

ఐకూ 11 స్మార్ట్‌ఫోన్ 100W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7500mAh బ్యాటరీతో రిలీజ్ అయింది. ఈ బ్యాటరీ 2-3 రోజులు వస్తుందని కంపెనీ చెబుతోంది.

12GB+256GB బేస్ వేరియంట్ ధర 2,599 యువాన్లు (సుమారు రూ.32,500). టాప్ వేరియంట్ 16GB+1TB ధర 3,799 యువాన్లు (సుమారు రూ. 47,000)గా కంపనీ నిర్ణయించింది.

ఐకూ 11 స్మార్ట్‌ఫోన్ చైనాలో విండ్, గ్లోయింగ్ వైట్, పిక్సెల్ ఆరెంజ్, షాడో బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ చూడ్డానికి అద్భుతంగా ఉంది. చూస్తుంటేనే ఇప్పుడే కొనాలనిపిస్తోందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
 
						 
			