Leading News Portal in Telugu

Redmi Note 14 Pro+ Gets RS 10,000 Discount on Amazon – Grab the Deal Now


  • దీపావళి సేల్‌ 2025ను మిస్ అయ్యారా?
  • రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు
  • ఇప్పుడే కొనేసుకుంటే బెటర్

మీరు అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్‌ 2025ను మిస్ అయి అయినా ఏం చించించాల్సిన అవసరం లేదు. మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే.. ఇదే సరైన అవకాశం. చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ ‘రెడ్‌మీ’ ఫోన్‌లు చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్ ఫోన్‌పై అమెజాన్ భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్ రూ.25,000 లోపు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ దాని ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పనితీరు, AI లక్షణాలకు ప్రసిద్ధి చెందింది.

రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్ ఫోన్‌ 8GB+256GB వేరియంట్ ధర లాంచ్ సమయంలో రూ.34,999గా ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్ ధర ఇప్పుడు రూ.26,998కి తగ్గించబడింది. అంటే మీరు రూ.8,001 డైరెక్ట్ డిస్కౌంట్ పొందుతున్నారు. మీరు SBI లేదా Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే.. మీకు అదనంగా రూ.2,250 డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో ఈ ఫోన్ ధర రూ.24,748కి తగ్గుతుంది. మొత్తంగా 10వేల తగ్గింపు మీకు అందుతుంది. ఈ ఆఫర్స్ పరిమితకాలం మాత్రమే ఉంటుంది. రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్ కొనాలనుకునే వారు ఇప్పుడే కొనేసుకుంటే బెటర్.

రెడ్‌మీ నోట్‌ 14 సిరీస్‌లో హైఎండ్‌ మోడలే ప్రో+. ఇది 6.67 అంగుళాల 1.5k అమోలెడ్‌ డిస్‌ప్లే, 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జనరేషన్‌ 3 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఇచ్చారు. 50 ఎంపీ ప్రధాన కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 50 ఎంపీ టెలిఫొటో లెన్స్‌ ఉంటుంది. 20MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 6,200 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. 90W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఫోన్ కొన్ని నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. నీరు మరియు ధూళి రక్షణ కోసం IP66, IP68 మరియు IP69 రేటింగ్‌ ఉంటుంది.