Vivo X300: చైనాలో ఈ మధ్యనే లాంచ్ అయినా vivo X300 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఎంపిక చేసిన యూరోపియన్ దేశాల ద్వారా గ్లోబల్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. స్పెసిఫికేషన్లలో పెద్దగా మార్పులు లేకపోయినా, గ్లోబల్ వెర్షన్‌లో బ్యాటరీ సామర్థ్యం మాత్రమే కొంత తగ్గించబడింది. డిజైన్, డిస్‌ప్లే పరంగా చూస్తే.. vivo X300 అద్భుతమైన ఫోన్. ఇది 6.31 అంగుళాల LTPO AMOLED స్క్రీన్‌తో వస్తుంది. అలాగే ఇది1.05mm అతి సన్నని బెజెల్స్‌తో దీని డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. BOE Q10+ మెటీరియల్‌తో రూపొందించిన ఈ డిస్‌ప్లే 2160Hz PWM డిమ్మింగ్, ఫుల్ బ్రైట్‌నెస్ DC డిమ్మింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. 4500 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఈ డిస్‌ప్లే కళ్లకు సౌకర్యంగా ఉండే విధంగా రూపొందించబడింది.
AUS vs IND: 5, 2, 1, 0.. ఇవి టీమిండియా టాప్ బ్యాటర్ల స్కోర్!
ఇక పనితీరు విషయానికి వస్తే.. Vivo X300 కొత్త Dimensity 9500 చిప్‌సెట్‌పై పని చేస్తుంది. ఇది AnTuTu 11 బెంచ్‌మార్క్‌లో 4 మిలియన్ పాయింట్లకు పైగా స్కోర్ సాధించింది ప్రాసెసర్. ఈ ఫోన్ 16GB వరకు LPDDR5X ర్యామ్, 512GB (UFS 4.1) స్టోరేజ్‌తో లభిస్తుంది. ఆండ్రాయిడ్16 ఆధారిత OriginOS 6.0పై ఆధారపడి నడిచే ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌లతో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను అందిస్తుంది. ఇక కెమెరా విభాగంలో vivo X300 ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. 1/1.4 అంగుళాల Samsung HPB సెన్సార్‌తో కూడిన 200MP మెయిన్ కెమెరా OIS మద్దతుతో వస్తుంది. అలాగే 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (OIS మరియు టెలిమాక్రో ఫీచర్లతో) ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోసం వివో ప్రత్యేకంగా ZEISS 2.35x టెలిఫోటో ఎక్స్‌టెండర్ కిట్, గ్రిప్ కిట్‌ను ఆప్షనల్‌గా విక్రయిస్తోంది.
Sushant Singh death : “చేతబడి చేశారు.. ఇద్దరూ కలిసి చంపారు” – సుశాంత్ అక్క సంచలన ఆరోపణలు
యూరోప్ వెర్షన్‌లో బ్యాటరీ సామర్థ్యం కొంత తగ్గించి 5360mAhగా ఉంచారు. ఇది చైనాలో 6040mAh గా ఉంది. ఈ ఫోన్ 90W అల్ట్రా-ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇక ధర విషయానికి వస్తే vivo X300 ఫాంటమ్ బ్లాక్, హాలో పింక్ రంగులలో అందుబాటులో ఉంది. 16GB + 512GB వేరియంట్ ధర 1,049 యూరోలు (రూ.1,07,600) గా నిర్ణయించారు. ప్రస్తుతం ఇది ఆస్ట్రియా, స్పెయిన్, పోలాండ్, హంగరీ, చెక్ రిపబ్లిక్, ఇటలీ దేశాలలో అమ్మకానికి లభిస్తోంది. నవంబర్‌లో ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో.. అలాగే భారతదేశంలో డిసెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.
 
						 
			