Vivo X300 Pro: వివో (Vivo) అత్యాధునిక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Vivo X300 Proను ఎంపిక చేసిన యూరోపియన్ దేశాలతో పాటు ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశపెట్టింది. చైనా వెర్షన్‌తో పోలిస్తే స్పెసిఫికేషన్లలో పెద్దగా మార్పులు లేకపోయినా.. అంతర్జాతీయ మార్కెట్ కోసం బ్యాటరీ సామర్థ్యంలో స్వల్ప మార్పు చేసింది. ఇక పనితీరు పరంగా Vivo X300 Pro స్మార్ట్ ఫోన్ Dimensity 9500 SoC చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది AnTuTu 11 బెంచ్‌మార్క్‌లో 4 మిలియన్లకు పైగా పాయింట్లు సాధించింది. ఫోన్ 16GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఇది వేగవంతమైన మల్టిటాస్కింగ్, భారీ స్టోరేజ్ సామర్థ్యాన్ని అందిస్తుంది.
IND vs AUS: బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 125 పరుగులకే ఆలౌట్..!
ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఈ ఫ్లాగ్‌షిప్ మొబైల్ 6.78 అంగుళాల 1.5K 120Hz LTPO OLED డిస్‌ప్లేతో వస్తుంది. BOE Q10+ మెటీరియల్‌తో రూపొందించిన ఈ స్క్రీన్ 2160Hz PWM డిమ్మింగ్, ఫుల్ బ్రైట్‌నెస్ DC డిమ్మింగ్, 4500 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. కేవలం 1.1mm సన్నని అంచులతో ఇది అత్యంత ఆకర్షణీయమైన విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. ఇక కెమెరా విభాగంలో Vivo X300 Pro ఒక కొత్త ప్రమాణాలన్ని సృష్టించింది. ఇది V3+, VS1 డ్యూయల్ ఇమేజింగ్ చిప్‌లు ఇంకా ZEISS ఆప్టిక్స్ మద్దతుతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. వీటిలో ప్రధాన కెమెరా 50MP 1/1.28″ Sony LYT828 సెన్సార్ ఆధారంగా రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఇది f/1.57 అపెర్చర్, OIS సపోర్ట్‌తో వస్తుంది. అలాగే, 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ 1/1.4″ Samsung HPB సెన్సార్, 3.7x ఆప్టికల్ జూమ్, OIS, టెలిమాక్రో ఫీచర్లను కలిగి ఉంది. అలాగే 50MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50MP ఫ్రంట్ కెమెరా అమర్చబడింది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోసం ZEISS 2.35x టెలిఫోటో ఎక్స్‌టెండర్ కిట్, గ్రిప్ కిట్ ను కూడా అవసరమైతే కొనుగోలు చేయవచ్చు.
ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. యూరోపియన్ మార్కెట్ వెర్షన్ 5440mAh సామర్థ్యంతో వస్తుంది. కాగా చైనా వెర్షన్‌లో 6510mAh బ్యాటరీ ఉంది. అయినప్పటికీ ఇది 90W అల్ట్రా-ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది Android 16 ఆధారిత OriginOS 6.0పై పని చేస్తుంది. డిజైన్, మన్నిక పరంగా ఈ ఫోన్ IP68+IP69 రేటింగ్‌లతో నీరు, దుమ్ము నిరోధకతను కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం 5G SA/NSA, Wi-Fi 7 (802.11 be), బ్లూటూత్ 5.4, NFC వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇది ఫాంటమ్ బ్లాక్, డూన్ బ్రౌన్ రంగులలో అందుబాటులో ఉంది.
IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 5360mAh బ్యాటరీతో వచ్చేసిన Vivo X300 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్..!
ఇక ధర విషయానికి వస్తే 16GB + 512GB వేరియంట్ ధర 1,399 యూరోలు (రూ.1,43,575) గా నిర్ణయించారు. ప్రస్తుతం ఆస్ట్రియా, స్పెయిన్, పోలాండ్, హంగరీ, చెక్ రిపబ్లిక్, ఇటలీ వంటి యూరోపియన్ దేశాలలో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. భారత మార్కెట్‌లో ఇది డిసెంబర్ నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే.. Vivo X300 Pro తన శక్తివంతమైన ప్రాసెసర్, అద్భుతమైన కెమెరా సిస్టమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు, ప్రీమియమ్ డిజైన్‌తో గ్లోబల్ మార్కెట్లో దూసుకపోనుంది.