Leading News Portal in Telugu

Realme C85 5G Launched with 7000mAh Battery, 50MP Camera, Dimensity 6300 Chipset


  • రియల్‌మీ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు
  • ఈరోజు వియత్నాంలో లాంచ్
  • రియల్‌మీ సీ85 5Gలో సూపర్ ఫీచర్స్

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ మార్కెట్లోకి మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. సీ సిరీస్‌లో భాగంగా రియల్‌మీ సీ85 5G, రియల్‌మీ సీ85 ప్రో 4G స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇందులో ఒకటి 5G ఫోన్ కాగా.. మరొకటి 4G ఫోన్. ఈరోజు వియత్నాంలో ఈ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కాగా.. త్వరలోనే అన్ని దేశాల్లో అందుబాటులోకి రానున్నాయి. సరసమైన ధరలలో ఈ ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. సీ85 5Gలో పిచ్చెక్కించే ఫీచర్స్ ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.

Realme C85 5g

రియల్‌మీ సీ85 5G స్మార్ట్‌ఫోన్‌ 6.8-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్ సహా 1,200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. ఇది MediaTek Dimensity 6300 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Realme UI 6పై నడుస్తుంది. 8GB RAM, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. 24GB వరకు వర్చువల్ RAMకి కూడా మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 50-మెగాపిక్సెల్ సోనీ IMX852 ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. నీరు, ధూళి రక్షణగా IP69 రేటింగ్ ఉంది.

Realme C85 5g Price

రియల్‌మీ సీ85 ప్రో 4G ఫోన్‌ 120Hz రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.8-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 685 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. 8GB RAM మరియు 256GB వరకు నిల్వతో జత చేయబడింది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీని కలిగి ఉంటున్ది. ఇందులో డ్యూయల్ స్పీకర్లు, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు IP69 వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి.

Realme C85 5g Specs

ఈ ఫోన్‌లు ప్రస్తుతం వియత్నాంలో లాంచ్ అయ్యాయి. Realme C85 5G (8GB RAM, 256GB) బేస్ మోడల్ ధర VND 7,690,000 (సుమారు రూ.26,100)గా ఉంది. Realme C85 Pro 4G ధర VND 6,490,000 (సుమారు రూ.22,100) నుండి ప్రారంభమవుతుంది. రెండు ఫోన్‌లు పారోట్ పర్పుల్ మరియు పీకాక్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయి. Realme 15xని C85 5G పోలి ఉంటుంది. ప్రధాన వ్యత్యాసం 15xలో వేగవంతమైన 70W ఛార్జింగ్.

Realme C85 5g Battery