- 10 శాతం నుంచి 12 శాతం రీఛార్జ్ చార్జీలు పెరిగే అవకాశం
 - రీఛార్జ్ చార్జీలు పెంచాలని ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, జియో నిర్ణయం
 
మొబైల్ వినియోగదారులకు మరోసారి షాక్ తగలనుంది. టెలికాం కంపెనీలు మరోసారి రీచార్జ్ ధరలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదే గనుక నిజమైతే.. దాదాపు 10 శాతం నుంచి 12 శాతం రీఛార్జ్ చార్జీలు పెరిగే అవకాశం లేకపోలేదు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. టెలికాం కంపెనీలు మరోసారి రీచార్జ్ ధరలు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొబైల్ వినియోగదారులపై 10 శాతం నుంచి 12 శాతం రీఛార్జ్ చార్జీలు పెంచాలని ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, జియో నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ప్రస్తుతం 199 రూపాయలు ఉన్న రీఛార్జ్ ప్లాన్ ను రూ.222లకు పెంచబోతున్నట్లు సమాచారం. అలాగే రూ. 899 రీఛార్జ్ ను 1006 రూపాయలకు పెంచాలని టెలికాం కంపెనీలు భావిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయట. అయితే ఈ ధరలు అందుబాటులోకి వస్తే దాదాపు ఒక్కో కస్టమర్ పై 10 నుంచి 12 శాతం భారం పడే అవకాశం ఉంటుందని నిపుణులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్ అవడంతో.. కొత్త సంవత్సరానికి ముందే మొబైల్ వినియోగదారులకు భారీ షాక్ ఇస్తున్నారని నెటిజన్లు, కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్ని సార్లు రీఛార్జ్ ఛార్జీలు పెంచుతారని ఫైర్ అవుతున్నారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.