ChatGPT Go: ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దిగ్గజ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) భారతీయ వినియోగదారులకు భారీ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ తమ మొదటి DevDay Exchange ఈవెంట్‌ను భారతదేశంలో నిర్వహించనున్న సందర్భంగా.. ChatGPT Go సబ్‌స్క్రిప్షన్‌ను ఒక ఏడాది పాటు ఉచితంగా అందిస్తున్నట్లు ధృవీకరించింది. ఈ ఆఫర్ ద్వారా భారతీయ వినియోగదారులు రాబోయే 12 నెలల పాటు ChatGPT Go ప్లాన్ ప్రయోజనాలను ఉచితంగా పొందవచ్చు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ ప్లాన్ వాస్తవానికి Plus సబ్‌స్క్రిప్షన్‌కు చౌకైన ప్రత్యామ్నాయంగా ఆగస్టులో విడుదలైంది. దీని నెలవారీ ఛార్జీ రూ.399 కాగా, Plus ప్లాన్ ఛార్జీ రూ.1,950 గా ఉన్నాయి.
రేసింగ్ స్ఫూర్తి.. ప్రత్యేక డిజైన్ తో Realme GT 8 Pro Aston Martin F1 ఎడిషన్ విడుదల..!
ChatGPT Go ప్లాన్ ఉచిత సేవ, Plus సబ్‌స్క్రిప్షన్ మధ్యస్థాయి ఆఫర్ ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల కోసం ప్రారంభించబడినప్పటికీ.. భవిష్యత్తులో ఇతర దేశాలలో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎంట్రీ లెవల్ సబ్‌స్క్రిప్షన్‌గా ఇది వీడియో జనరేషన్ లేదా Codex ఏజెంట్ యాక్సెస్ వంటి అధునాతన ఫీచర్లను అందించదు. అయితే AIను తరచుగా ఉపయోగించే వినియోగదారులకు ఇది పలు ప్రాయోజనకరమైన ఫీచర్లను అందిస్తుంది. ముఖ్యంగా రేట్ లిమిట్స్ పెంపు ద్వారా ఉచిత సేవలో లభించే అన్ని ఫీచర్లతో పాటు.. మెసేజ్‌లు, ఫైల్ అప్లోడ్‌లు, ఇమేజ్ జనరేషన్ కోసం 10 రెట్లు అధిక పరిమితులు అందిస్తాయి. అలాగే GPT-5 యాక్సెస్ కూడా ఈ ప్లాన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఇది OpenAI తాజా ఫ్రాంటియర్ మోడల్ కావడం ప్రత్యేకత. వీటితోపాటు ఈ ప్లాన్‌లో పైథాన్ (Python), ఇతర డేటా అనాలిసిస్ టూల్స్ వినియోగానికి కూడా అధిక పరిమితులు లభిస్తాయి. వినియోగదారులు తమ ప్రాజెక్టులు, టాస్కులు, కస్టమ్ GPTలను సృష్టించుకోవడం, నిర్వహించడం, ఇంకా అవసరాలకు అనుగుణంగా AI టూల్స్‌ను మెరుగుపరచడం చేయగలరు.
7000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. Realme C85 5Gలో పిచ్చెక్కించే ఫీచర్స్!
ChatGPT Go ఉచితంగా పొందడం ఎలా?
ఈ ఉచిత ఆఫర్‌ను యాక్టివేట్ చేయడం చాలా సులభం. ముందుగా మీరు సబ్‌స్క్రిప్షన్ పొందాలనుకుంటున్న ఖాతాలో ChatGPT వెబ్ వెర్షన్‌లో సైన్ ఇన్ చేయాలి. లాగిన్ అయిన వెంటనే “Try Go, Free” అనే పాప్-అప్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత ధరల పేజీకి వెళ్లి, Go ప్లాన్‌ను “రూ.0” ధర ఉన్న దానిని ఎంచుకోవాలి. ఆ తర్వాత చెల్లింపు పేజీలో “రూ.0” చెల్లింపు (UPI, క్రెడిట్/డెబిట్ కార్డు లేదా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా) పూర్తి చేయాలి. ఉచిత కాలం ముగిసిన తర్వాత ఆటోపే (autopay) కొనసాగకుండా ఉండటానికి దానిని ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. ఇక అంతే.. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే, మీ ChatGPT Go ప్లాన్ యాక్టివ్ అవుతుంది.