- మోటరోలా ఎడ్జ్ 70 స్లిమ్ డిజైన్ తో వచ్చేస్తోంది
- ఐఫోన్ ఎయిర్, గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్‌లతో పోటీ
మోటరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ ప్రపంచ మార్కెట్లో విడుదల కానుంది. మోటరోలా ఎడ్జ్ సిరీస్‌లోని ఈ తాజా స్మార్ట్‌ఫోన్ 3 కలర్ ఆప్షన్స్ లో ప్రవేశపెట్టారు. మోటరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ 5.99mm మందంతో ఎంపిక చేసిన మార్కెట్లో విడుదల అయ్యింది. దీని బరువు కేవలం 159 గ్రాములు. ఈ ఫోన్ ఐఫోన్ ఎయిర్, గెలాక్సీ S25 ఎడ్జ్‌లతో నేరుగా పోటీ పడనుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్, 12GB RAM తో విడుదలైంది. మోటరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల pOLED డిస్ప్లే, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తోంది.
మోటరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ UKలో GBP 700 (సుమారు రూ. 80,000) ధరకు లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ యూరప్, మిడిల్ ఈస్ట్‌లో EUR 799 (సుమారు రూ. 81,000) ధరకు లాంచ్ అవుతుంది. ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ త్వరలో ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అవుతుందని మోటరోలా ధృవీకరించింది. మోటరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల pOLED సూపర్ HD (1,220×2,712 పిక్సెల్స్) డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 446ppi పిక్సెల్ డెన్సిటీ, 20:09 యాస్పెక్ట్ రేషియోతో కలిగి ఉంది. డిస్‌ప్లే HDR10+, 300Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 4,500 nits గరిష్ట బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో కూడా వస్తుంది.
మోటరోలా ఎడ్జ్ 70 స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 12GB వరకు RAM, 512GB స్టోరేజ్ తో లింక్ చేశారు. ఫోటోగ్రఫీ కోసం, ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, ప్రత్యేకమైన 3-ఇన్-1 లైట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. కనెక్టివిటీ పరంగా, మోటరోలా ఎడ్జ్ 70 లో 5G, బ్లూటూత్, GPS, A-GPS, GLONASS, LTEPP, గెలీలియో, NFC, USB టైప్-C పోర్ట్, Wi-Fi 6E ఉన్నాయి. ఈ ఫోన్ డ్యూయల్ స్పీకర్ సెటప్‌ను కలిగి ఉంది.
డాల్బీ అట్మాస్‌కు మద్దతు ఇస్తుంది. సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, SAR సెన్సార్ ఉన్నాయి. మోటరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్ ఎయిర్‌క్రాఫ్ట్-గ్రేడ్ అల్యూమినియంతో తయారైంది. ఇది MIL-STD-810H మన్నికను అందిస్తుంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌లతో వస్తుంది. మోటరోలా ఎడ్జ్ 70 68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,800mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో శక్తినిస్తుంది.