Moto g57: మోటోరోలా (Motorola) తమ “G సిరీస్”లో కొత్తగా రెండు మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. మోటో జీ57 (Moto g57), మోటో జీ57 పవర్ (Moto g57 Power) స్మార్ట్ ఫోన్స్ ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది మోటోరోలా. ఈ రెండు ఫోన్‌లు Snapdragon 6s Gen 4 మొబైల్ ప్లాట్ ఫామ్ ప్రాసెసర్‌తో పనిచేస్తున్న మొట్టమొదటి ఫోన్‌లు కావడం వీటి ప్రత్యేకత. ఇవి రెండూ ఆక్టా-కోర్ Snapdragon 6s Gen 4 (4nm) చిప్‌సెట్‌తో వస్తాయి. ఇందులో 4x Cortex-A78 కోర్లు 2.4GHz, 4x Cortex-A55 కోర్లు 1.8GHz వద్ద పనిచేస్తాయి. ఇక వీటిలో గ్రాఫిక్స్ కోసం Adreno GPU మద్దతు ఇస్తుంది. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే ఇది 6.72 అంగుళాల FHD+ LCD స్క్రీన్ ఉండి, 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ను ఉపయోగించారు.
Ind vs Aus 4th T20: ఉత్కంఠభరిత పోరుకు సర్వం సిద్ధం.. ఆధిక్యం సాధించేది ఎవరు..?

ఇక కెమెరా విషయానికి వస్తే.. మొబైల్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా (Sony LYT-600 సెన్సార్, f/1.8), 8MP అల్ట్రా వైడ్ కెమెరా (f/2.2) ఉన్నాయి. ముందు భాగంలో 8MP ఫ్రంట్ కెమెరా (f/2.2) పంచ్ హోల్ డిజైన్‌లో అమర్చారు. ఇక సాఫ్ట్‌వేర్ పరంగా రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి. వీటిలో 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఇక బ్యాటరీ విషయంలో.. మోటో జీ57లో 5200mAh బ్యాటరీ, జీ57 పవర్‌లో భారీ 7000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంది. ఈ రెండు ఫోన్‌లు కూడా 30W టర్బో ఛార్జింగ్ సదుపాయాన్ని కలిగి ఉన్నాయి. ఇక వీటితోపాటు IP64 రేటింగ్ కారణంగా.. దుమ్ము, నీటి తుంపరల నుండి రక్షణను అందించడమే కాకుండా.. MIL-STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ను కూడా పొందాయి.
RCB For Sale: అమ్మకానికి ఐపీఎల్ ఛాంపియన్ టీం.. ధర ఎంతంటే..?
ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. 5G, 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.1, NFC వంటి కనెక్టివిటీ ఆప్షన్‌లు ఉన్నాయి. అలాగే 3.5mm ఆడియో జాక్, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్లు, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉన్నాయి. ఇక ధర పరంగా.. మోటో జీ57 ధర 249 యూరోలు (రూ.25,345) కాగా.. ఇది పాంటోన్ రేగట్ట, పింక్ లేమోనెడ్, కార్సెయిర్, ఫ్లూయిడిటీ వంటి రంగుల్లో మిడిల్ ఈస్ట్ మార్కెట్‌లో లభిస్తుంది. ఇక మరోవైపు మోటో జీ57 పవర్ ధర 279 యూరోలు (రూ.28,395) కాగా, ఇది మేటీఓరైట్, పింక్ లేమోనెడ్, కార్సెయిర్, రేగట్ట రంగుల్లో యూరోప్ మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. మొత్తం మీద డిజైన్, శక్తివంతమైన బ్యాటరీ, Snapdragon 6s Gen 4 ప్రాసెసర్‌తో మోటోరోలా ఈ కొత్త మిడ్ రేంజ్ ఫోన్‌లతో పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది.