Leading News Portal in Telugu

OnePlus 15 Launch on November 13: 7300mAh Battery, Cryo-Velocity Cooling, IP66+IP68+IP69+IP69K Protection


OnePlus 15: వన్‌ప్లస్ (OnePlus) కంపెనీ మరో సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌తో అభిమానుల ముందుకు రానుంది. వన్‌ప్లస్ 15 (OnePlus 15) గ్లోబల్, భారతీయ మార్కెట్లలో నవంబర్ 13న సాయంత్రం 7 గంటలకు అధికారికంగా లాంచ్ కానుంది. ఈ ఫోన్ వేగం, పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, డిస్‌ప్లే క్వాలిటీ వంటి అంశాల్లో కొత్త ప్రమాణాలు సృష్టించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వన్‌ప్లస్ 15 వినియోగదారులకు ఇప్పటివరకు చూడని విజువల్ ఫ్లూయిడిటీని అందించనుంది. స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో తొలిసారిగా 1.5K రిజల్యూషన్, 165Hz LTPO డిస్‌ప్లేను అందించనున్న ఈ ఫోన్, మోషన్ ఫ్లూయిడిటీతో పాటు అద్భుతమైన స్పష్టతను కలిగిస్తుంది. 6.78 ఇంచుల పరిమాణంలో ఉండే ఈ స్క్రీన్ 1800 నిట్స్ హై బ్రైట్‌నెస్ మోడ్‌తో సూర్యరశ్మిలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. TÜV Rheinland Intelligent Eye Care 5.0 సర్టిఫికేషన్ పొందిన ఈ డిస్‌ప్లేలో “Eye Comfort Reminder”, “Eye Comfort Mode” ఫీచర్లు కూడా ఉంటాయి. ఇవి ఎక్కువ సేపు గేమింగ్ లేదా వీడియో చూసే సమయంలో కళ్లపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

Vande Mataram: నేడు “వందేమాతరం” 150 వ వార్షికోత్సవాలు.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ

వన్‌ప్లస్ 15 లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 మొబైల్ ప్లాట్‌ఫారమ్ ఉంది. దీనికి తోడుగా టచ్ రెస్పాన్స్ చిప్, ప్రత్యేక Wi-Fi చిప్ ఉన్నాయి. ఈ ట్రిపుల్ చిప్ ఆర్కిటెక్చర్ ఫోన్‌ను ఎలాంటి పరిస్థితుల్లోనైనా వేగంగా, స్మూత్‌గా పని చేసేలా చేస్తుంది. OxygenOS 16 సిస్టమ్ ఆప్టిమైజేషన్‌తో కలిపి ఈ ఫోన్‌లో మల్టీటాస్కింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది. వినియోగదారులు ఒకేసారి రెండు గేమ్స్ రన్ చేసినా లేదా అనేక యాప్స్ మార్చుకున్నా ఎలాంటి ల్యాగ్ లేకుండా పనిచేస్తుంది. వన్‌ప్లస్ 15 లో “Cryo-Velocity Cooling System” అనే అత్యాధునిక వేడి నియంత్రణ వ్యవస్థను వాడింది. ఇది 5,731mm² 3D వేపర్ చాంబర్, ఏరోజెల్ ఇన్సులేషన్ లేయర్, వైట్ గ్రాఫైట్ బ్యాక్ కవర్‌తో కూడి ఉంటుంది. దీని వల్ల ఫోన్ వేడి తగ్గడంతో.. గేమింగ్ సమయంలో కూడా స్మూత్ పనితీరు కొనసాగుతుంది. వన్‌ప్లస్ 15 లో ఇప్పటివరకు వన్‌ప్లస్ ఫోన్‌లలోనే పెద్ద బ్యాటరీ అయిన 7300mAh సామర్థ్యం కలిగిన “సిలికాన్ నానోస్టాక్” బ్యాటరీని ఉపయోగించారు. 15% సిలికాన్ కంటెంట్ ఉన్న ఈ బ్యాటరీ అధిక ఎనర్జీ డెన్సిటీని అందిస్తుంది. ఇది 120W SUPERVOOC వైర్డ్ ఛార్జింగ్, 50W AIRVOOC వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. “Bypass Charging” ఫీచర్ ద్వారా ఛార్జింగ్ సమయంలో వేడి తగ్గి, బ్యాటరీ ఆయుష్షును పెరుగుతుంది.

The Great Pre Wedding Show Movie Review: తిరువీర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ రివ్యూ

వన్‌ప్లస్ 15 ఫోన్ IP66, IP68, IP69, IP69K సర్టిఫికేషన్లు పొందింది. దీని వల్ల ఇది ధూళి, నీరు, అధిక ఒత్తిడి నీటి జెట్‌ల నుండి రక్షణ పొందుతుంది. వన్‌ప్లస్ 15 పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు నవంబర్ 13న సాయంత్రం 7 గంటలకు జరగబోయే లాంచ్ ఈవెంట్‌లో ప్రకటించబడతాయి. ఫోన్ అదే రోజు రాత్రి 8 గంటల నుంచి అమెజాన్, వన్‌ప్లస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.