- మార్కెట్లో ఫ్లాష్ మెమొరీకి పెరిగిన డిమాండ్
- తగినంత సరఫరా లేకపోవడంతో మార్కెట్లో ఫ్లాష్ మెమొరీ కొరత
దేశంలో జీఎస్టీ తగ్గడంతో స్మార్ట్ టీవీ ధరలు తగ్గాయి. అయితే ఏఐ ఫీచర్ రావడంతో మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో ఫ్లాష్ మెమొరీకి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ మెమరీని AI మోడళ్లలో కూడా ఉపయోగిస్తారు. పెరిగిన డిమాండ్ తగినంత సరఫరా లేకపోవడంతో మార్కెట్లో ఫ్లాష్ మెమరీ కొరత ఉంది. దీంతో ఫ్లాష్ మెమరీ ధరలు పెరిగాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే.. జీఎస్టీ రేటు మార్పుల తరువాత.. స్మార్ట్ టీవీ ధరలు తగ్గాయి. అయితే.. ఏఐ ఫీచర్ రావడంతో మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉంది. కంపెనీలు తెలిపిన వివరాల ప్రకారం. తగినంత సరఫరా లేకపోవడం వల్ల, మార్కెట్లో ఫ్లాష్ మెమరీ కొరత ఉంది. దీని వల్ల ఫ్లాష్ మెమరీ ధరలు పెరిగాయి. అధిక డిమాండ్ ఉండడంతో గత మూడు నెలల్లో ఫ్లాష్ మెమోరీ ధరలు 50శాతం పెరిగాయి.
టెలివిజన్ తయారీదారులు సరఫరాదారులు ప్రస్తుతం DDR3, DDR4 మెమరీ చిప్‌ల కొరతను ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. AI డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ చిప్ తయారీదారుల దృష్టిని మార్చిందని, దీని వలన వినియోగదారు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులలో ఉపయోగించే మెమరీ చిప్‌ల కొరత ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. AI డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ చిప్ తయారీదారుల దృష్టిని మార్చిందని.. స్మార్ట్ టీవీ ధరలు ఎంత పెరుగుతాయో ఇంకా స్పష్టంగా తెలియదు. కంపెనీలు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాయని.. SPPL CEO అవనీత్ సింగ్ మార్వా తెలిపారు.””ఇది గత మూడు నెలలుగా గణనీయమైన కొరత , పదునైన ధరల పెరుగుదలకు దారితీసింది. ధరలు 50% కంటే ఎక్కువ పెరిగాయి. 2021-22లో చిప్ కొరత తర్వాత ఇది అతిపెద్ద సమస్య. LED టీవీ ధరలు త్వరలో పెరుగుతాయి.” ఫ్లాష్ మెమరీలో ఎక్కువ భాగం చైనా నుండి వస్తుంది. దీనిని టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, USB పరికరాలు , అనేక ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.