Realme GT 8 Pro: రియల్‌మీ (Realme) సంస్థ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ GT 8 ప్రో (Realme GT 8 Pro)ను భారతదేశంలో నవంబర్ 20న లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ మొబైల్ ప్రధానంగా తన ప్రత్యేకమైన కెమెరా సిస్టమ్ ద్వారా స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలలో ఒక కీలక అడుగుగా నిలువనుంది. రియల్‌మీ GT 8 ప్రో స్మార్ట్ ఫోన్ ను రియల్‌మీ, RICOH IMAGING భాగస్వామ్యంతో రూపొందించబడిన RICOH GR-పవర్డ్ కెమెరా టెక్నాలజీతో మార్కెట్‌లోకి రానుంది. ప్రొఫెషనల్ గ్రేడ్ ఆప్టిక్స్, RICOH GR సిరీస్ ప్రత్యేకమైన ఫోటోగ్రఫీ సౌందర్యాన్ని స్మార్ట్‌ఫోన్ కెమెరాకు అందించడమే ఈ సహకారం ముఖ్య లక్ష్యం. ఈ ఇమేజింగ్ సిస్టమ్ ప్రధాన అంశం RICOH IMAGINGతో కలిసి ఇంజనీరింగ్ చేసిన అల్ట్రా-హై ట్రాన్స్‌పరెన్సీ ఇమేజ్ ను అందించడం. ఈ ఫోన్‌లో డెడికేటెడ్ RICOH GR మోడ్ ఉంటుంది. ఇది RICOH ఫోటోగ్రఫీ వారసత్వాన్ని ప్రతిబింబించే ఐదు ప్రత్యేకమైన RICOH GR టోన్‌లతో పాటు, రెండు క్లాసిక్ ఫోకల్ లెంగ్త్‌లను అందిస్తుంది.
Rajnath Singh: భవిష్యతే చెబుతుంది.. పాక్ అణు పరీక్షలపై రాజ్‌నాథ్‌సింగ్ రియాక్షన్
GT సిరీస్ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. GT 8 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 చిప్‌సెట్, హైపర్ విజన్ AI చిప్ ఉన్నాయి. ఈ కలయిక అత్యధిక పనితీరు, మెరుగైన విజువల్ ప్రాసెసింగ్, సమర్థతను అందిస్తుందని భావిస్తున్నారు. ఈ మొబైల్ 7000mAh బ్యాటరీ, 120W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. డిజైన్ పరంగా ఈ ఫ్లాగ్‌షిప్ మొబైల్ రియల్‌మీ “ఇండస్ట్రీ-ఫస్ట్ డిజైన్ ఇన్నోవేషన్”గా పేర్కొన్న ఫీచర్‌ను పరిచయం చేసింది.
Rajnath Singh: భవిష్యతే చెబుతుంది.. పాక్ అణు పరీక్షలపై రాజ్‌నాథ్‌సింగ్ రియాక్షన్
ప్రపంచంలోనే మొట్టమొదటి మార్చగల కెమెరా బంప్ (switchable camera bump) ఈ మొబైల్ కలిగి ఉంది. ఇది వినియోగదారులు తమ పరికరం రూపాన్ని మార్చడానికి సహకరిస్తుంది. డిజైన్‌లో ప్రత్యేకమైన కాగితం లాంటి లెదర్ బ్యాక్ ప్యానెల్ తో స్థిరత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇది రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌లు, వస్త్రాల నుండి తయారు చేయబడింది. ఈ డిజైన్ ఫోటోనిక్ నానో కార్వింగ్ సాంకేతికతను ఉపయోగించి ప్రీమియం ఫినిషింగ్‌ను ఇస్తుంది. రియల్‌మీ GT 8 ప్రో డైరీ వైట్, అర్బన్ బ్లూ అనే రెండు రంగులలో లభిస్తుంది. రియల్‌మీ GT 8 ప్రో పనితీరు, ప్రత్యేకమైన డిజైన్, నెక్స్ట్-జనరేషన్ ఇమేజింగ్ టెక్నాలజీని కలపడం ద్వారా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లలో కొత్త ప్రమాణాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత రియల్‌మీ వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్ లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
What kind of magic happens when the switchable camera bump of realme GT 8 Pro meets different daily outfits? pic.twitter.com/GyqgRbiREx
— realme Global (@realmeglobal) November 7, 2025