- 18 సిరీస్ లాంచ్‌కు ఇంకా 10 నెలల సమయం
- ఇప్పటి నుంచే 18 సిరీస్ ఫీచర్స్ లీక్స్
- అతిపెద్ద అప్‌గ్రేడ్‌తో ఐఫోన్ 18 సిరీస్
- 18లో మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు, సూపర్ డిజైన్
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ‘యాపిల్’ తన రాబోయే ఫ్లాగ్షిప్ ఫోన్లైన ఐఫోన్ 18 సిరీస్‌ను వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. 18 సిరీస్ లాంచ్‌కు ఇంకా 10 నెలల సమయం ఉంది. అయినా ఇప్పటి నుంచే ఫీచర్స్ లీక్ అవ్వడం ప్రారంభమయ్యాయి. యాపిల్ కంపెనీ ఈ సిరీస్ ఫోన్లను సరికొత్త రియర్ డిజైన్‌తో లాంచ్ చేయవచ్చు. అదనంగా ఐఫోన్ 18 ప్రో సిరీస్ మూడు కొత్త కలర్ ఆప్షన్లలో రానున్నట్లు తెలుస్తోంది. అతిపెద్ద అప్‌గ్రేడ్‌తో ఐఫోన్ 18 సిరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో యాపిల్ కంపెనీ ఐఫోన్ 17 సిరీస్‌ను ప్రారంభించింది. 17 సిరీస్ విడుదలైన రెండు నెలలకే ఐఫోన్ 18 మోడళ్ల ఫీచర్లు లీక్ అవుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. ఐఫోన్ 18 సిరీస్‌లో అతిపెద్ద అప్‌గ్రేడ్ ఫ్రంట్ కెమెరా. ఐఫోన్ 18 సిరీస్‌లోని అన్ని మోడళ్లలో 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు. ప్రస్తుత ఐఫోన్ 17 మోడళ్లలో 18 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 24-మెగాపిక్సెల్ కెమెరా మెరుగైన పనితీరు, పదునైన పోర్ట్రెయిట్ షాట్లను అందిస్తుంది. ఈ అప్గ్రేడ్లను ఐఫోన్ 18, ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్, ఐఫోన్ ఎయిర్ 2, ఆపిల్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్లలో ఉండే అవకాశాలు ఉన్నాయి.
యాపిల్ తన ఐఫోన్ 17 సిరీస్‌లో సెంటర్ స్టేజ్ కెమెరా సిస్టమ్‌ను పరిచయం చేసింది. ఇది చదరపు ఆకారపు సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అప్పట్లో 24-మెగాపిక్సెల్ సెన్సార్ గురించి చర్చించబడినప్పటికీ.. ఆ ఫీచర్ ఐఫోన్ 17లో లేదు. ఐఫోన్ 18లో దాదాపుగా ఖాయం అని తెలుస్తోంది. ఐఫోన్లో 24-మెగాపిక్సెల్ అండర్-డిస్ప్లే కెమెరాను ఇవ్వనున్నారు. అంటే స్క్రీన్‌పై నాచ్, కటౌట్ ఉండవు. దాంతో ఫోన్ డిస్ప్లే పూర్తిగా స్మూత్‌గా కనిపిస్తుంది. బడ్జెట్ మోడల్ ఐఫోన్ 18eలో 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కొనసాగించవచ్చు. ప్రధాన అప్గ్రేడ్లు ప్రీమియం మోడళ్లలో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
రాబోయే స్మార్ట్‌ఫోన్ యాపిల్ A20 ప్రాసెసర్ ఇస్తుందని తెలుస్తోంది. ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో పారదర్శక బ్యాక్ ప్యానెల్ ఉండనుంది. ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లో స్టీల్-ఎన్కేస్డ్ బ్యాటరీ ఉండనుంది. ఐఫోన్ 18 ప్రో సిరీస్ కోసం ఆపిల్ HIAA (హోల్ ఇన్ యాక్టివ్ ఏరియా) టెక్నాలజీని పరీక్షిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. హై-ఎండ్ మోడల్స్ (ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ ఎయిర్ 2, ఫోల్డబుల్ ఐఫోన్) 2026 ద్వితీయార్థంలో లాంచ్ అవుతాయని తెలుస్తోంది. స్టాండర్డ్ ఐఫోన్ 18, ఐఫోన్ 18e మోడల్స్ 2027 ప్రారంభంలో లాంచ్ కావచ్చు. యాపిల్ ఉత్పత్తి వ్యూహంలో ఒక ప్రధాన అడుగుగా ఇది నిరూపించబడవచ్చు.