- బడ్జెట్ ధరలో షావోమీ స్మార్ట్‌ఫోన్
- డిసెంబర్ 3న భారతదేశంలో రెడ్‌మీ 15సీ లాంచ్
- 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో రెడ్‌మీ 15సీ
Redmi 15C 5G To Launch in India Under RS 10,000: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘షావోమీ’కి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడమే ఇందుకు కారణం. సామాన్యులకు అందుబాటులో ధరలో బిగ్ బ్యాటరీ, టాప్ కెమెరా సహా సూపర్ ఫీచర్స్‌లను అందిస్తూ ‘షావోమీ సక్సెస్ అయింది. భారత మొబైల్ మార్కెట్లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ‘రెడ్‌మీ 15సీ’ 5G పేరుతో ఈ హ్యాండ్‌సెట్ డిసెంబర్ 3న భారతదేశంలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయిన Redmi 14C 5Gకి అప్‌గ్రేడ్.
రెడ్‌మీ 15సీ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే ప్రపంచ మార్కెట్‌లో రిలీజ్ అయింది. డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ లాంటి స్పెసిఫికేషన్లను అంచనా వేయవచ్చు. షావోమీ అధికారిక ప్లాట్‌ఫామ్‌లో వెల్లడించిన స్పెసిఫికేషన్ల ప్రకారం.. రెడ్‌మీ 15సీ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరాను ఉంచే నాచ్ కటౌట్‌ను కూడా కలిగి ఉంటుంది. డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా ఉండగా.. 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.
రెడ్‌మీ 15సీ 5G స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జర్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. బయోమెట్రిక్ అన్‌లాకింగ్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ప్రారంభ ధర దాదాపు రూ.10,000 ఉండవచ్చని అంచనా. డిసెంబర్ 3న ఈ ఫోన్ ఫుల్ డీటెయిల్స్ తెలియరానున్నాయి. రెడ్‌మీ 15సీ బడ్జెట్ 5G ఫోన్ అనే చెప్పాలి.