Oppo A6x 5G Expected Launch in India.. Expected Price, Features, 6500mAh Battery and Specifications are
Oppo A6x 5G: ఒప్పో (Oppo) సంస్థ త్వరలో Oppo A6x 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్ రూ.12,499 ప్రారంభ ధరతో 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌తో బెటర్ పెర్ఫార్మన్స్ ఇవ్వనుంది. ఈ మొబైల్ ముఖ్యంగా 6500 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో పొందవచ్చు. ఇక రాబోయే ఈ మొబైల్ సంబంధించి పూర్తి వివరాలను చూసేద్దామా..
భారీ బ్యాటరీ:
Oppo A6x 5G స్మార్ట్‌ఫోన్‌లో పెద్దదైన 6500 mAh బ్యాటరీ సామర్థ్యం, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభించే అవకాశం ఉంది. ఈ బ్యాటరీతో వినియోగదారులు అధిక వినియోగంలో కూడా 2 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను సులభంగా పొందవచ్చు. అలాగే, ఇది 18W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇవ్వవచ్చు. దీనితో ఇతర పరికరాలను కూడా ఈ ఫోన్‌తో ఛార్జ్ చేయవచ్చు.
కొత్త వెల్వెట్ రెడ్ వేరియంట్ భారత్‌లో Oppo Find X9 అందుబాటులోకి.. ధర, ఫీచర్స్ ఇలా..!
కెమెరా సెటప్:
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. ఇందులో 13MP ప్రధాన సెన్సార్, సెకండరీ VGA లెన్స్ ఉండవచ్చు. ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరాను అమర్చవచ్చు. అయితే కొన్ని లీక్స్ ప్రకారం ఇది కనీసం 50MP ప్రధాన సెన్సార్, ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాను పొందే అవకాశం కూడా ఉంది.
డిస్‌ప్లే, ఇతర ఫీచర్లు:
Oppo A6x 5G లో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉండబోతుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 850 నిట్స్ సాధారణ బ్రైట్నెస్ తో వస్తుంది. ఫోన్ భద్రత కోసం ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేషియల్ రికగ్నిషన్‌తో పాటు ధూళి మరియు స్ప్లాష్ నిరోధకత కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా లభించే అవకాశం ఉంది.
PEDDI OTT Rights : రామ్ చరణ్ – బుచ్చి ‘పెద్ది’ డిజిటల్ రైట్స్.. ఎన్ని కోట్లు పలికాయంటే
ధరలు:
Oppo A6x 5G స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 2025 లేదా జనవరి 2026 ప్రారంభంలో భారతదేశంలో విడుదల అవుతుందని అంచనా. ఈ ఫోన్ ధరలు 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.12,499, 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.13,499, 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ.14,999గా ఉండవచ్చు.