Xiaomi Smart TV X Pro QLED Series: షియోమీ (Xiaomi) కంపెనీ తాజాగా విడుదల చేసిన స్మార్ట్ టీవీ X Pro QLED 65-inch (మోడల్: L65MB-APIN) ప్రస్తుతం మార్కెట్లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అత్యుత్తమ క్వాలిటీ, మన్నికైన పనితీరు అందించే స్మార్ట్ టీవీగా ఈ మోడల్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇకపోతే ఈ టీవీ అసలు ధర రూ.89,999గా ఉండగా, ఇప్పుడు ఇది 36% తగ్గింపుతో కేవలం రూ.57,999కే లభిస్తుంది. అంటే ఈ టీవీపై ఏకంగా రూ.32000 వేలు ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ పై కూడా మరింత డిస్కౌంట్ లభించనుంది.
IND vs SA: భారత జట్టులో ఏదో తప్పు జరుగుతోంది.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ 65 అంగుళాల (165 సెంటీమీటర్ల) భారీ QLED స్క్రీన్‌ను కలిగి ఉన్న ఈ టీవీ 4K Ultra HD (3840 × 2160 పిక్సెల్స్) రిజల్యూషన్‌ను అందిస్తుంది. 120 Hz రీఫ్రెష్ రేట్‌తో ఇది అల్ట్రా-స్మూత్ మోషన్‌ను అందించడంతో.. సినిమాలు, స్పోర్ట్స్, గేమింగ్ వంటి ప్రతి వీక్షణ అనుభవం మరింతగా అందించనుంది. ఇక 16:9 స్క్రీన్ నిష్పత్తి విజువల్స్‌ను సహజమైన రూపంలో చూపుతుంది. ఈ స్మార్ట్ టీవీ గూగుల్ టీవీ (Google TV) ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. బెజిల్-లెస్ స్లీక్ డిజైన్, బిల్ట్-ఇన్ క్రోమ్ క్యాస్ట్, ఐ కంఫర్ట్ మోడ్, డెడికేటెడ్ గేమ్ మోడ్, మిరాకస్ట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ టీవీని మరింత ప్రీమియంగా, వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా మార్చుతున్నాయి.
Vemulawada: రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో తాత్కాలిక బ్రేక్..!

కనెక్టివిటీ విషయంలో ఈ టీవీ.. HDMI, USB, బ్లూటూత్, ఈథర్నెట్, Wi-Fi, అలాగే 3.5mm ఆడియో జాక్ వంటి అనేక పోర్ట్స్‌ను కలిగి ఉంది. ఆడియో పరంగా DTS సపోర్ట్‌తో ఉన్న సౌండ్ సిస్టమ్ స్పష్టమైన, వినతగ్గ ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. ప్యాకేజీలో LED టీవీ యూనిట్‌తో పాటు రిమోట్ కంట్రోల్, రెండు స్టాండ్ యూనిట్లు, రెండు AAA బ్యాటరీలు, పవర్ కార్డ్ లభిస్తాయి. మొత్తం టీవీ బరువు 19.9 కిలోలుగా ఉండగా.. దీని కొలతలు 39.1 × 144.5 × 90 సెం.మీగా ఉన్నాయి.