Leading News Portal in Telugu

Samsung Galaxy Tab A11+ Launched in India: 5G Support, 11-inch Display and 7040mAh Battery


  • శాంసంగ్‌ నుంచి కొత్త టాబ్లెట్‌ భారత్‌లో విడుదల
  • శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్ లాంచ్
  • 5G సపోర్ట్, 7040mAh బ్యాటరీ, బెస్ట్ ఫీచర్స్

దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్‌’ తన కొత్త టాబ్లెట్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఏ సిరీస్‌లో భాగంగా ‘శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్’ (Samsung Galaxy Tab A11+)ను లాంచ్ చేసింది. ఈ టాబ్లెట్ 11-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది Wi-Fi, 5G మద్దతుతో వచ్చింది. ఈ టాబ్లెట్ ప్రారంభ ధర రూ.22,999గా ఉంది. 7040mAh బ్యాటరీ, బెస్ట్ ఫీచర్స్ ఉన్న గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం.

శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్ రెండు రంగులలో విడుదల చేయబడింది: గ్రే, సిల్వర్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. శాంసంగ్‌ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లు, అమెజాన్ సహా ఇతర ప్రధాన రిటైల్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. Wi-Fi 6GB/128GB వేరియంట్ ధర రూ.22,999గా కంపెనీ ప్రకటించింది. రూ.3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. దాంతో బేస్ వేరియంట్ ధర రూ.19,999కి తగ్గుతుంది. 5G వేరియంట్‌ 6GB/128GBలో వస్తుంది. దీని ధర రూ.26,999గా ఉంది. రూ.3,000 బ్యాంక్ ఆఫర్ అనంతరం రూ.23,999కి అందుబాటులో ఉంటుంది.

గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్ 11-అంగుళాల TFT LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ టాబ్లెట్ ఆక్టా-కోర్ MediaTek MT8775 (2.5GHz + 2GHz) 4nm ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 6GB లేదా 8GB RAM ఎంపికలతో వస్తుంది. స్టోరేజ్ ఆప్షన్లలో 128GB, 256GB ఉన్నాయి. మైక్రో SD కార్డ్‌తో 2TB వరకు విస్తరించవచ్చు. ఈ టాబ్లెట్ OneUI 8తో Android 16లో రన్ అవుతుంది. ఇందులో 8MP ఆటోఫోకస్ వెనుక కెమెరా సెన్సార్, 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది Dolby Atmos మద్దతుతో డ్యూయల్ స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంది. 25W అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జర్‌తో 7040mAh బ్యాటరీని కలిగి ఉంది.