Leading News Portal in Telugu

Vivo X300, X300 Pro Launched in India with Massive Discounts.. Price, Specs, Offers Revealed


  • Vivo X300 మరియు X300 Pro స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్
  • రెండు ఫోన్‌లలోనూ Dimensity 9500 ప్రాసెసర్, 1.5K LTPO డిస్‌ప్లే, Wi-Fi 7, 4500 నిట్స్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు
  • X300: గరిష్టంగా 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్, 6040mAh బ్యాటరీ.
  • X300 Pro: 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్, 6510mAh బ్యాటరీ.

Vivo X300, X300 Pro: వివో సంస్థ నుండి Vivo X300, X300 Pro ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లో నేడు విడుదలయ్యాయి. అధునాతన కెమెరా సాంకేతికత, శక్తివంతమైన ప్రాసెసర్, అత్యుత్తమ డిస్‌ప్లే ఫీచర్లతో ఈ ఫోన్‌లు ప్రీమియం సెగ్మెంట్‌లో లాంచ్ అయ్యాయి. Vivo X300లో 6.31 అంగుళాల 1.5K LTPO OLED డిస్‌ప్లే అందించగా.. Vivo X300 Proలో 6.78 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లేను అందించారు. రెండింటిలోనూ Dimensity 9500 ఆక్టా-కోర్ ప్రాసెసర్ అమర్చబడింది. Vivo X300లో 12GB –16GB ర్యామ్, 256GB –512GB స్టోరేజ్ ఆప్షన్‌లు ఉండగా.. Vivo X300 Proలో 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్‌తో వస్తోంది. బ్యాటరీ పరంగా Vivo X300లో 6040mAh, Vivo X300 Proలో 6510mAh సామర్థ్యం ఉండగా.. రెండింటిలోనూ 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌లను అందించారు. ఈ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ఉండే Origin OS 6.0పై పనిచేస్తాయి. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 + IP69 రేటింగ్‌లు కూడా ఉన్నాయి. అలాగే వీటిలో Wi-Fi 7, BOE Q10+ డిస్‌ప్లే మెటీరియల్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్ వంటి ఫీచర్లు రెండు ఫోన్‌లలోనూ అందుబాటులో ఉన్నాయి.

Minister Sridhar Babu: గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష.. నేరుగా ఫీల్డ్ లోకి ఎంట్రీ..!

కెమెరా విభాగం ఈ సిరీస్‌కి ప్రత్యేక హైలైట్‌గా నిలుస్తుంది. Vivo X300లో 200MP Samsung HPB ప్రధాన సెన్సార్‌ను ఉపయోగించగా, X300 Proలో 50MP Sony LYT828 పెద్ద సైజు సెన్సార్‌ను అమర్చారు. టెలిఫోటో విషయంలో X300లో 50MP పెరిస్కోప్ లెన్స్ 3x ఆప్టికల్ జూమ్‌ను అందిస్తే, X300 Proలో 200MP పెరిస్కోప్ కెమెరా 3.7x ఆప్టికల్ జూమ్‌ను అందిస్తున్నది. రెండు ఫోన్‌లలోనూ 50MP అల్ట్రా-వైడ్, 50MP ఫ్రంట్ కెమెరాలు అందించారు. అలాగే, ఈ రెండు మోడళ్లు ZEISS 2.35x టెలికన్వర్టర్ కిట్‌కు మద్దతు ఇస్తాయి. ఇది ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీని మరింత మెరుగుపరుస్తుందని సంస్థ పేర్కొంది.

Image (1)

ఇక ధరల విషయానికి వస్తే.. Vivo X300 12GB+256GB వేరియంట్ ధర రూ.75,999 కాగా, 12GB+512GB మోడల్ రూ.81,999, 16GB+512GB మోడల్ రూ.85,999గా ఉంది. ఇక X300 Pro 16GB+512GB మోడల్ ధర రూ.1,09,999గా నిర్ణయించారు. ZEISS 2.35x టెలిఫోటో ఎక్స్‌టెండర్ కిట్‌ను విడిగా రూ.18,999కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లు వివో ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో నేటి నుంచే బుకింగ్‌కి అందుబాటులో ఉంటాయి. అమ్మకాలు డిసెంబర్ 10 నుంచి ప్రారంభమవుతాయి.

Local Body Elections: పంచాయతీ ఎన్నికల వేళ ‘వరాల జల్లులు’.. ఇంటికి రూ.5 లక్షల బీమా, పెళ్లికి పుస్తె మెట్టెలు ఇంకా ఎన్నో..!

ఇక లాంచ్ ఆఫర్లలో SBI, HDFC, IDFC ఫస్ట్ బ్యాంకు, ఎస్ బ్యాంకు కార్డులపై 10% ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, V-Upgrade ద్వారా 10% తగ్గింపు, ఒక సంవత్సరం ఉచిత అదనపు వారంటీ, 60% అష్యూర్డ్ బైబ్యాక్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా ఇందులో 24 నెలల వరకు నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది. ఇంకా ZEISS టెలిఫోటో కిట్‌తో కలిసి కొనుగోలు చేస్తే రూ.4,000 ఫ్లాట్ డిస్కౌంట్ లేదా 10% వెంటనే క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

Image