- భారత మార్కెట్లో కొత్త ఫ్లాగ్‌షిప్ శకానికి నాంది
- జైస్ భాగస్వామ్యంతో కెమెరా రెడిఫైన్
- 200MP కెమెరా, 6510mAh బ్యాటరీ
- పిచ్చెక్కించే ఫీచర్లతో వివో ఎక్స్ 300 ప్రో లాంచ్
భారత మార్కెట్లో విప్లవాత్మక ఫ్లాగ్‌షిప్‌గా నిలిచేలా ‘వివో’ కంపెనీ కొత్తగా Vivo X300 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో Vivo X300, Vivo X300 Pro మోడళ్లు ఉన్నాయి. గత సంవత్సరం వచ్చిన X200 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లు ZEISS కలిసి రూపొందించిన ఇమేజింగ్ వ్యవస్థ, MediaTek Dimensity 9500 ప్రాసెసర్ వంటి శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా కెమెరా సెటప్, డిస్‌ప్లే, బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్ ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో కొత్త ఫ్లాగ్‌షిప్ శకానికి నాంది.
Vivo X300 Pro Disply:
సినిమాటిక్ విజువల్స్ కోసం వివో ఎక్స్ 300 ప్రోలో 6.78-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. స్క్రీన్ రిజల్యూషన్ 2800 × 1260 (1.5K+) కాగా.. రిఫ్రెష్ రేట్ 120Hz. ఇందులో మల్టీ-టచ్ సపోర్ట్ కూడా ఉంది. అధిక బ్రైట్‌నెస్ , అద్భుతమైన కలర్ ప్రొడక్షన్, హై-ఎండ్ గేమింగ్, HDR మీడియా వీక్షణకు ఈ స్క్రీన్ అత్యుత్తమ అనుభవాన్ని అందిస్తుంది.
Vivo X300 Pro Camera:
వివో ఎక్స్ 300 ప్రోలో 200MP టెలిఫోటోను ఇచ్చారు. ఇది అద్భుత క్వాలిటీతో ఫోటోలను అందిస్తుంది. వెనకవైపు 50MP Sony LYT-828 ప్రైమరీ (OISతో) ఉండగా.. 50MP వైడ్-యాంగిల్ (119° FOV, AFతో) 200MP టెలిఫోటో (3.5x optical zoom, OIS) ఉన్నాయి. జైస్ Adaptive Zoom Flash ద్వారా 24mm, 50mm, 85mm ఫోకల్ లెంగ్త్‌లకు అనుగుణంగా ఫ్లాష్ బ్రైట్నెస్‌ను ఆటోమేటిక్‌గా మార్చుకోవచ్చు. పోర్ట్రెయిట్స్, నైట్ మోడ్ ఫోటోగ్రఫీకి ఈ ఫీచర్ గేమ్‌చేంజర్ అనే చెప్పాలి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ZEISS wide-angle ఇచ్చారు. ఇది మీకు అత్యుత్తమ క్వాలిటీని అందిస్తుంది.
Vivo X300 Pro Processor:
వివో ఎక్స్ 300 ప్రోలో ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ ఇచ్చారు. MediaTek Dimensity 9500 చిప్‌సెట్ ఉంటుంది. 4.21GHz వేగంతో పనిచేసే C1-Ultra కోర్ ఉంది. Android 16 ఆధారంగా రూపొందించిన OriginOS 6తో వచ్చింది. దాంతో మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్, సూపర్‌ఫాస్ట్ యాప్ లోడింగ్, అద్భుతమైన మల్టీటాస్కింగ్ అనుభవం ఉంటుంది.
Vivo X300 Pro Battery
వివో ఎక్స్ 300 ప్రో ఫోన్‌లో 6510mAh బ్యాటరీని ఇచ్చారు. ఇది 90W ఫ్లాష్‌చార్జ్ మద్దతు ఉంటుంది. వేగంగా చార్జ్ అవుతుంది. నిరంతరం ఫోన్ వాడే యూజర్లకు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇందులో IP68 + IP69 రేటింగ్ ఇచ్చారు. ఇది నీరు, దుమ్ము, హై-ప్రెజర్ జెట్ స్ప్రేల నుండి రక్షణ ఇస్తుంది. ఫోటోగ్రఫీ ప్రియులు, పవర్ యూజర్లు, గేమర్లందరికీ ఇదొక మంచి ఫ్లాగ్‌షిప్ ఫోన్. ప్రత్యేకంగా ZEISS కెమెరా సిస్టమ్, Dimensity 9500 ప్రాసెసర్, 6510mAh బ్యాటరీ ఈ ఫోన్‌ను మార్కెట్లో మిగతా స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ప్రత్యేకంగా నిలబెడతాయి.
Vivo X300 Pro Price:
వివో ఎక్స్300 ప్రో ఫోన్ ధర రూ.1,09,999 (16/512GB)గా ఉంది.