Leading News Portal in Telugu

ఎంఐ నోట్ 5 స్పెసిఫికేషన్లు లీక్.. అదిరిపోయిన ఆప్షన్లు!

న్యూఢిల్లీ: ఈనెల 31న చైనాలోని షెంజెన్‌లో ఫ్లాగ్‌షిప్ మొబైల్ ఎంఐ 8, ఎంఐయూఐ 10తోపాటు మరికొన్నింటిని కూడా షియోమీ విడుదల చేయనుంది. ఇదే కార్యక్రమంలో ఎంఐ బ్యాండ్ 3ని కూడా విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఎంఐ నోట్5ను కూడా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబరులో విడుదల చేసిన ఎంఐ నోట్ 3కి సక్సెసర్‌గా ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, ధరల వివరాలు లీకయ్యాయి. చైనా మీడియాలో చక్కర్లు కొడుతున్న వివరాల ప్రకారం..

ఎంఐ నోట్ 5 స్పెసిఫికేషన్లు: 5.99 అంగుళాల డిస్‌ప్లే, అల్ట్రాథిన్ బేజెల్స్, 4జీబీ ర్యామ్, 64 జీబీ, 6జీబీ/64జీబీ ఆన్‌బోర్డు స్టోరేజీ వేరియంట్లు. 4జీబీ/64 జీబీ వేరియంట్ ధర దాదాపు రూ.24,400 ఉండే అవకాశం ఉంది. ఎంఐ నోట్ 3 ధర (రూ.26,500)తో పోలిస్తే కొంచెం తక్కువే.