Leading News Portal in Telugu

Reliance Jio యూజర్లకు మరొక శుభవార్త…..

భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్లలో ఒకటైన రిలయన్స్ జియో ఇటీవలే ఏప్రిల్ 1, 2020 వరకు చెల్లుబాటు అయ్యే “జియో డేటా ప్యాక్” కింద 2GB అదనపు డేటాను ఉచితంగా ఇచ్చింది. లాక్ డౌన్ ఇంకా ఈ నెల మొత్తం ఉండవచ్చు అని తెలుస్తోంది.

వినియోగదారులు ఉచిత హైస్పీడ్ డేటా ప్లాన్‌తో ఇప్పుడు పూర్తిగా వారి యొక్క పనులను సులభంగా చేస్తున్నారు. ఇటువంటి సమయంలో మళ్ళి వినియోగదారులు ఇలాంటి డేటా ప్లాన్‌ల కోసం వెతకవచ్చు. కొత్త డేటా ప్లాన్‌లను చూస్తున్న వినియోగదారుల కోసం రిలయన్స్ జియో రోజుకు 2GB డేటా ప్లాన్‌లను రూ.249 నుండి ఆఫర్ చేస్తున్నది. అంతేకాకుండా రోజుకు 2GB డేటా ప్లాన్‌లను నాలుగు 4G డేటా యాడ్‌తో కలిపి కూడా చేయవచ్చు. ఈ యాడ్-ఆన్ ప్యాక్‌లు వినియోగదారులకు మరింత అదనపు డేటాను అందిస్తాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో ప్రస్తుతం మూడు రోజువారి 2GB డేటా ప్యాక్ లను అందిస్తున్నది. రోజుకు 2GB డేటాను అందించే ప్యాక్‌లలో మొదటిది రూ.249 ధర గల ప్లాన్ మొత్తం చెల్లుబాటు కాలానికి 56GB డేటాను 28 రోజుల వాలిడిటీకి అందిస్తుంది. ఇది జియోయేతర నంబర్లకు 1000 నిమిషాల కాలింగ్‌ను మరియు జియో నంబర్‌లకు అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది. SMS క్యాప్ రోజుకు 100 కి పరిమితం చేయబడింది మరియు ఈ ప్లాన్ Jio యాప్ లకు కాంప్లిమెంటరీ చందాను అందిస్తుంది.

రూ.244 ప్యాక్‌కు సమానమైన అన్ని రకాల ప్రయోజనాలను అందించే రూ.444 మరియు రూ.599 ప్యాక్‌లను కూడా జియో సంస్థ అందిస్తున్నది. అయితే వీటి యొక్క చెల్లుబాటు సమయం వరుసగా 56 రోజులు మరియు 84 రోజులు. రిలయన్స్ జియో యొక్క రూ.444 ప్యాక్ వినియోగదారులకు మొత్తం చెల్లుబాటు కాలానికి 112GB డేటాను, 2000 నిమిషాల నాన్-జియో కాలింగ్‌ను అందిస్తుంది. ఈ సెగ్మెంట్ లో టాప్ టైడ్ ప్లాన్ రూ.599 ప్యాక్ తన మొత్తం చెల్లుబాటు కాలానికి 168GB డేటాను మరియు 3000 నిమిషాల నాన్-జియో కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తుంది.