Reliance Jio ఇతర టెల్కోలతో పోలిస్తే ఇందులో వెనుకబడింది…
రిలయన్స్ జియో మొదటిసారి రూ.1,699 ప్లాన్‌ను ప్రవేశపెట్టినప్పుడు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు 2018 లో ట్రెండ్‌గా మారాయి. జియో అడుగుజాడలను అనుసరించి ఇతర ప్రైవేట్ టెల్కోలు భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియాతో పాటు ప్రభుత్వ నేతృత్వంలోని బిఎస్‌ఎన్‌ఎల్ కూడా వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి.
రిలయన్స్ జియో కొంతకాలంగా తన ప్రీపెయిడ్ ప్లాన్‌లను సవరిస్తున్నది. ఇందులో భాగంగా దాని వార్షిక ప్రణాళికలలో కూడా కొన్ని చిన్న మార్పులను తీసుకువచ్చింది. జియో ఇప్పుడు 336 రోజుల చెల్లుబాటుతో రోజుకు 1.5GB డేటాను రూ.2,121 ధర గల వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌తో అందిస్తోంది. మరోవైపు బిఎస్‌ఎన్‌ఎల్‌లో రూ.1,999 ధర వద్ద గల తన వార్షిక ప్లాన్‌తో 3GB రోజువారీ డేటాను అందిస్తున్నది. అలాగే ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా కూడా వరుసగా రూ.2,398 మరియు రూ.2,399 ధరల వద్ద తన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. రిలయన్స్ జియో అందిస్తున్న ఈ ప్లాన్‌లో రెండు అంశాలలో ప్రతికూలతలు ఉన్నాయి. అవి రూ.2,121 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క చెల్లుబాటు మరియు ఇతర నంబర్లకు అవుట్గోయింగ్ వాయిస్ కాలింగ్. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
Jio యొక్క దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్ 1.5GB రోజువారీ డేటా సమర్పణతో మొత్తం చెల్లుబాటు కాలానికి 504GB డేటాను అందిస్తుంది. అలాగే Jio to Jio అపరిమిత వాయిస్ కాలింగ్, 12000 నిమిషాల నాన్-జియో వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMS వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్రయోజనాలు అన్ని రీఛార్జ్ చేసిన తేదీ నుండి 336 రోజుల వరకు చెల్లుతాయి. ఇది జియో సినిమా, జియోటివి మరియు అన్ని జియో యాప్ లకు కాంప్లిమెంటరీ చందాను కూడా అందిస్తుంది.
బిఎస్ఎన్ఎల్ తన రూ.1,699 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క చెల్లుబాటును ఇటీవల 300 రోజులకు తగ్గించినందున రోజువారీ డేటా ప్రయోజనంతో ఉన్న ఏకైక వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1,999. ఈ ప్లాన్‌లో 3GB డేటా, రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, బిఎస్‌ఎన్‌ఎల్ టివి, బిఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్‌కు మొదటి 60 రోజులు చందాను అందిస్తుంది. డేటా, కాలింగ్ మరియు SMS ప్రయోజనాలు 365 రోజులు చెల్లుతాయి.
భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా యొక్క రూ.2,398 మరియు రూ.2,399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు రోజుకు 1.5GB డేటాను అందిస్తున్నాయి. ఇవి రెండు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయిన అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలను 365 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తున్నాయి.