Leading News Portal in Telugu

Indian Flags: భారీ ఎత్తున జాతీయ జెండాలు తయారయ్యేది అక్కడే.. ఇప్పటికే పోటెత్తిన ఆర్డర్లు – Telugu News | National flags are being made on a large scale in Sirisilla district, Telangana


సిరిసిల్ల జిల్లా వస్త్ర పరిశ్రమలో 25 వేలకు పైగా మరమగ్గాలు ఆర్డర్లతో పాటు నిత్యం పవర్‎లూమ్స్‎పై 30 లక్షల మీటర్ల పాలిస్టర్ తెలుపు రంగు వస్త్ర ఉత్పత్తి జరుగుతోంది. దీనికి అవసరమైన రంగుల అద్దకం కోసం హైదరాబాద్ లో మూడు రంగుల జెండా ప్రింటింగ్ చేస్తారు. ప్రింటింగ్ అయ్యాకా సిరిసిల్లలో కటింగ్ చేసి, కుట్టించి ప్యాక్ చేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేయనున్నారు.

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం సిద్దం చేసింది. ఈ వేడుకల్లో అన్ని రంగాలను భాగస్వాములను చేయనుంది. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా 115 కోట్ల జాతీయ జెండాలను పంపిణీ చేయాలని సంకల్పించింది. జెండాల తయారీకి అవసరమైన తెలుపు రంగు పాలిస్టర్ వస్త్రాన్ని గుజరాత్ నుండి వస్త్ర పరిశ్రమ నుంచి సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్డర్ల నుంచి కాకుండా నిల్వ ఉన్న వస్త్రం మ్యాక్స్ సంఘాలు, ఎస్ఎస్ఎస్ఐ యూనిట్ల నుంచి టెస్కో వివరాలు సేకరిస్తున్నారు. వజ్రోత్సవాల వేడుకలకు పరిశ్రమల నుంచి సుమారు కోటి మీటర్ల పైగా పాలిస్టర్ వస్త్రం సేకరించి దీనికితోడు స్థానికంగా తయారు చేసిన జాతీయ జెండాలు విక్రయాలు కూడా జరుగుతున్నాయి. ఎక్కువగా పాట్నా, సూరత్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల నుంచి ఆర్డర్లు రావడంతో ఈ ఏడాది కూడా వస్త్ర పరిశ్రమ, దాని అనుబంధ రంగాల వారికి అదనపు ఉపాధి లభిస్తోంది.

ఇక సిరిసిల్ల జిల్లా వస్త్ర పరిశ్రమలో 25 వేలకు పైగా మరమగ్గాలు ఆర్డర్లతో పాటు నిత్యం పవర్‎లూమ్స్‎పై 30 లక్షల మీటర్ల పాలిస్టర్ తెలుపు రంగు వస్త్ర ఉత్పత్తి జరుగుతోంది. దీనికి అవసరమైన రంగుల అద్దకం కోసం హైదరాబాద్ లో మూడు రంగుల జెండా ప్రింటింగ్ చేస్తారు. ప్రింటింగ్ అయ్యాకా సిరిసిల్లలో కటింగ్ చేసి, కుట్టించి ప్యాక్ చేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేయనున్నారు. జాతీయ జెండాల తయారీకి ప్రభుత్వం వందశాతం పాలి మరమగ్గాలపై జెండాల తయారీకి ఉపయోగించే పాలిస్టర్ వస్త్రం స్టర్ నూలుతో ఒక జెండా సైజు 20×30 ఇంచులతో ఉన్న వస్త్రం సేకరించాలని టెస్కోకు సూచించింది. తొలి విడత 36 లక్షల పైగా మీటర్లు సేకరించాలనీ నిర్ణయించారు. వస్త్రం నిల్వలను బట్టి ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది మీటరుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక జెండాకు రూ.12 చెల్లించి కొనుగోలు చేసింది. ఈసారి కూడా అదే ధర నిర్ణయించడంతో ఆదివారం నుంచి పట్టణంలోని టెస్కో గోదాంకు వస్త్రాన్ని తీసుకురావాలని అధికారులు తెలిపారు. ఇప్పటికి వివిధ రాష్ట్రలు.. ఆర్డర్స్ ఇచ్చాయి. ఈసారి పెద్ద, పెద్ద సైజ్ లో జాతీయ జెండాలను తయారు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వం ఉత్సవాల తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. సేకరించిన తెలుపు రంగు వస్త్రానికి రంగులు అద్దకం పూర్తిగా హైదరాబాద్ లోని ప్రాసెసింగ్ యూనిట్లలో జరుగుతుంది. ఇలా రంగులు అద్దిన జెండా వస్త్రాన్ని జిల్లాకు తెప్పించుకుని నిర్ణీత కొలతల్లో కత్తిరించి, కుట్టు మిషనపై కుడుతారు. ఒక్క జెండ కుట్టినందుకు రూపాయి కూలి ఇస్తారు. వీటిపై ఆధారపడి సుమారు వెయ్యి మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. జెండాల తయారీకి ప్రైవేటు ఆర్డర్లతో పాటు ప్రభుత్వ ఆర్డర్లు కూడా ఉంటాయి. ఒక్కో మహిళ రోజుకు సగటున రూ.1500 పైగా సంపాదిస్తారు.

ఎటుచూసిన జాతీయ జెండాలు కనబడుతున్నాయి. జెండాల తయారీ లో కార్మికులు బిజీ అయ్యారు. సుమారుగా 12 గంటల పాటు పని చేస్తున్నారు. అయినప్పటికీ.. ఇంకా పూర్తి స్థాయిలో.. జెండాలు అందించడం కష్టంగా ఉంది. ఇప్పటికే కటింగ్ పూర్తి అయింది. జెండాలను కుడుతున్నారు. అయితే కార్మికులు జెండాలు తయారు చేయడాన్ని ఉపాధిగా చూడకుండా అదృష్టంగా భావిస్తున్నారు. తాము తయారు చేసిన జెండాలు వివిధ ప్రాంతాల్లో ఎగురవేయడం గర్వకారణంగా ఉందని అంటున్నారు నేతన్నలు. అంతేకాదు ఎంతో సంతోషంతో జెండాలను తయారు చేస్తున్నారు. లక్షలాది మువ్వన్నెల జెండాలు చూడాలంటే.. సిరిసిల్ల రావల్సిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..