Leading News Portal in Telugu

Telangana: అద్దె ఇంటి కోసం ఆన్‌లైన్లో వెతుకుతున్నారా ? అయితే మీ జేబులకు చిల్లే.. – Telugu News | Online scammers cheats a man in the name of House Rent in Hyderabad


హైదరాబాద్ లో ఇళ్లు కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటారు…కొనుక్కునే వారైతే నేరుగా స్థలం దగ్గరకు వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకుంటారు. కానీ రెంట్ కు తీసుకునే వాళ్ళు ఏ వెబ్ సైట్ లేదా తెలిసిన ఏజెంట్ నో సంప్రదిస్తారు. ఇంకొందరు ఐతే టు లెట్ స్టీకెర్ కాంటక్ట్ నంబర్ కు చేస్తారు. ఇప్పుడు ఇలా రెంట్ కు తీసుకునే వారిని టార్గెట్ చేస్తు దోచుకుంటున్నారు సైబర్ నేరగాల్లు. హైదరాబాద్ లో రీసెంట్ గా జరిగిన ఒక ఘటన లో రెంట్ పేరుతో ఏకంగా 89 వేలు కాజేసారు. సంగారెడ్డి లో ఉంటున్న ఒక యువకుడు రెంట్ పేరుతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఆశ్రయించాడు .

హైదరాబాద్ లో ఇళ్లు కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటారు…కొనుక్కునే వారైతే నేరుగా స్థలం దగ్గరకు వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకుంటారు. కానీ రెంట్ కు తీసుకునే వాళ్ళు ఏ వెబ్ సైట్ లేదా తెలిసిన ఏజెంట్ నో సంప్రదిస్తారు. ఇంకొందరు ఐతే టు లెట్ స్టీకెర్ కాంటక్ట్ నంబర్ కు చేస్తారు. ఇప్పుడు ఇలా రెంట్ కు తీసుకునే వారిని టార్గెట్ చేస్తు దోచుకుంటున్నారు సైబర్ నేరగాల్లు. హైదరాబాద్ లో రీసెంట్ గా జరిగిన ఒక ఘటన లో రెంట్ పేరుతో ఏకంగా 89 వేలు కాజేసారు. సంగారెడ్డి లో ఉంటున్న ఒక యువకుడు రెంట్ పేరుతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఆశ్రయించాడు . కేస్ నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇక వివరాల్లోకి వెళ్తే అమెరికా నుండి హైదరాబాద్ వచ్చాడు ఒక ఇంజనీర్. ప్రస్తుతం అతను సంగారెడ్డి లో ఉంటున్నాడు. వర్క్ ఫ్రమ్ హోం చేస్తూ తెలిసిన వారి ఇంట్లో ఉన్నాడు. గచ్చిబౌలి లో ఒక ఇళ్ళు అద్దెకు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అసలే అమెరికా రిటర్న్స్ ..ఏమున్నా ఆన్లైన్ లో రివ్యూ చూసి వెళ్తుంటారు. ఇల్లు కూడా అలానే చూసాడు. రెంటల్స్ కు చెందిన ఒక వెబ్ సైట్ ఓపెన్ చేసాడు. గచ్చిబౌలి లో ఒక సింగిల్ బెడ్ రూం నెలకు రూ.10 వేల రెంట్. మూడు నెలలు అడ్వాన్స్ ఇవ్వాలంటూ ఒక పోస్ట్ కనిపించింది. వెంటనే దాని క్లిక్ చేశాడు. అందులో ఒక కాంటాక్ట్ నెంబర్ కనిపించింది. వెంటనే ఆ నెంబర్ కు ఫోన్ చేసాడు. ఫస్ట్ పేమెంట్ చేస్తే అడ్వాన్స్ బుక్ చేసినట్టే అని చెప్పడం తో ముందుగా 15 వేలు పంపించాడు.

ఫోన్ పే ద్వారా ముందు ఒకసారి పంపాడు. ఆ అమౌంట్ రాలేదు సార్ అని చెప్పడం తో మళ్ళీ అదే అమౌంట్ పంపాడు. ఆ నగదు రెండు సార్లు పంపిన కూడా రిసీవ్ కాలేదని బాధితుడిని నమ్మించాడు. నిజంగానే అమౌంట్ పోలేదా అని అనుమానం వచ్చి స్టేట్మెంట్ తీసాడు ..అప్పటికే అతడి అకౌంట్ లో డబ్బులు కట్ అయ్యాయి.. ఏజెంట్ కు ఫోన్ చేయగా ఒక వేళ అమౌంట్ రెండు సార్లు వస్తె నేను రిటర్న్ కొడుతా అని నమ్మించాడు. మళ్ళీ ఇతర ఖర్చుల పేరుతో మొత్తం 89 వేల రూపాయలు చెల్లించాడు…ఇదంతా మీరు జాయిన్ అయ్యిన వెంటనే రిఫండ్ వస్తుంది అని చెప్పాడు. కొన్ని రోజులు తరువాత అసలు నిజంగానే అక్కడ ఇల్లు ఉందా లేదా అని తెలుసుకోవడానికి వెళ్ళాడు సదరు యువకుడు. అక్కడ అంతా ఓపెన్ ల్యాండ్ కనిపించడంతో అవకాయ్యాడు. తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..