Leading News Portal in Telugu

Gruha Lakshmi Scheme: గృహలక్ష్మి పథకానికి నేటితో గడువు ముగియనుందా? కీలక ప్రకటన చేసిన మంత్రి – Telugu News | Gruha Lakshmi scheme application first phase last date ends on today, Minister Vemula Prashanth Reddy releases key statement Telugu News


. గృహలక్ష్మీ పథకం కింద సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మూడు లక్షల రూపాలయను కేటాయిస్తుంది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. దరఖాస్తు చేసేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. అయితే తొలి విడతలో భాగంగా దరఖాస్తుకు ఈ నెల 10 వరకే గడువు వుండటంతో ప్రభుత్వ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మీ’ పథకానికి సంబంధించి మంత్రి ప్రశాంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గృహలక్ష్మీ పథకానికి ఇవాళ్టి వరకే గడువు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. గృహలక్ష్మీ పథకం కింద సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మూడు లక్షల రూపాలయను కేటాయిస్తుంది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. దరఖాస్తు చేసేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. అయితే తొలి విడతలో భాగంగా దరఖాస్తుకు ఈ నెల 10 వరకే గడువు వుండటంతో ప్రభుత్వ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఆశావహులు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన క్యాస్ట్, ఇన్ కమ్, రెసిడెన్స్ సర్టిఫికేట్ల కోసం తహసిల్దార్ కార్యాలయం, మీ సేవా కేంద్రాలకు పరుగు తీస్తున్నారు. దీంతో తహశీల్దార్ కార్యాలయాలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంతి రెడ్డి స్పందించారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. గృహలక్ష్మీ దరఖాస్తుల విషయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు దుష్ఫ్రచారం చేస్తున్నాయని.. వాటిని నమ్మొద్దని మంత్రి వేముల ప్రజలకు సూచించారు. ఖాళీ స్థలం ఉన్నవారెవరైనా సరే గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఆగస్టు 20లోగా మొదటి విడత లబ్ధిదారుల జాబితా..

కాగా గృహలక్ష్మి దరఖాస్తుదారులు తమ ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తులు పంపించవచ్చన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి . ప్రస్తుతం మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేళ ఇళ్లు పూర్తయితే.. రెండో దశలో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఇళ్లు లేని పేదలు ఆందోళన చెందవద్దని, దశలవారీగా ఇంటి నిర్మాణాల కోసమే ఈ పథకం అమలు చేస్తున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కాగా ఆగస్టు 20వ తేదీలోపు గృహలక్ష్మీ పథకం మొదటి దశ దరఖాస్తుల పరీశీలన ప్రక్రియను పూర్తి చేసి లబ్ధిదారుల జాబితాను ప్రకటించేందుకు అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తోంది. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేశారు. జిల్లా మంత్రి ఆమోద ముద్రతో తుది జాబితాను రూపొందించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.