Leading News Portal in Telugu

Aha: ఆహా వారి ‘నేను సూపర్ ఉమెన్’ షో‌కు దక్కిన అరుదైన బహుమతి.. వాళ్లకి బంపర్ ఆఫర్ – Telugu News | Aha’s Super Woman Show got super woman fund


ఆహా ‘నేను సూపర్ ఉమెన్ – ఇది మహిళల బిజినెస్ డ్రీమ్స్‌కి డోర్ బెల్. ఈ షోల భాగంగా ఈ స్టేజ్ మీదకి మహిళలు వచ్చి వాళ్ల బిజినెస్ ఐడియాలను ప్రెజెంట్ చేస్తారు. వాళ్ల ఐడియాలను ఎంకరేజ్ చేస్తూ వాళ్ల బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఏంజెల్స్ కూడా ఉంటారు. ఈ ఆహా షోలో ఏంజెల్స్ హేమాహేమీలే వచ్చారు. అయితే ఈ షో పై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతిభ ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగే నిధుల ద్వారా అవసరమైన వాళ్లని ఆదుకుంటామని జయేష్ రంజన్ చెప్పడం వల్ల ఇది ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోందని అంటున్నారు.

గత మూడు వారాలుగా తెలుగు మహిళలని ఎంతో ఉత్తేజపరుస్తున షో ఆహా వారి ‘నేను సూపర్ ఉమెన్. వంటింటి మాటలు ఇపుడు మొత్తం ఇపుడు ఈక్విటీ, పర్సంటేజీ మాటలుగా మార్చిన ఘనత ఆహా కు మాత్రమే దక్కింది. అందుకే తెలంగాణ గవర్నమెంట్ నుంచి ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజాన్, వీ హబ్ సీఈఓ దీప్తి రావులు కలిసి ‘సూపర్ ఉమెన్ ఫండ్’ అని ప్రకటించారు. ఆ ఎపిసోడ్ ఈ శుక్ర మరియు శనివారం రాత్రి 7 గంటలకు ఆహా లో ప్రసారం కానుంది. జయేష్ రంజాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్య విభాగాలు ప్రిన్సిపాల్ సెక్రటరీ మాట్లాడుతూ, “ఆహా వారితో కలిసి ఈ షో చేయడం ఎంతో ఆనందగా ఉంది. అందుకే మా వంతు సాయంగా మేము ఈ ‘సూపర్ వుమెన్ ఫండ్’ ని అందరికి అందుబాటులోకి తేబోతున్నాం. ఏ వుమెన్ ఇంటర్ప్రెన్యూర్స్ కి అయితే ప్రతిభ ఉండి ఇన్వెస్ట్మెంట్ దక్కలేదో, వారికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే, ఏంజెల్స్ ఇన్వెస్ట్ చేసిన, ఇంకా స్కేలాబిలిటీ కోసం డబ్బు అవసరమైన వాళ్ళకి కూడా ఈ ఫండ్ ద్వారా మేము మద్దతు ఇస్తాము. వి హబ్ వారు ఈ ఫండ్ ని ఎలా మరియు ఎక్కడ ఉపయోగించాలి అనే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే, ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళా వ్యాపారవేత్తలకు తోడుగా నిలుస్తుంది అని ఈ షో ద్వారా నేను మరోసారి అందరికి తెలియజేస్తున్నానని వెల్లడించారు.

ఆహా ‘నేను సూపర్ ఉమెన్ – ఇది మహిళల బిజినెస్ డ్రీమ్స్‌కి డోర్ బెల్. ఈ షోల భాగంగా ఈ స్టేజ్ మీదకి మహిళలు వచ్చి వాళ్ల బిజినెస్ ఐడియాలను ప్రెజెంట్ చేస్తారు. వాళ్ల ఐడియాలను ఎంకరేజ్ చేస్తూ వాళ్ల బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఏంజెల్స్ కూడా ఉంటారు. ఈ ఆహా షోలో ఏంజెల్స్ హేమాహేమీలే వచ్చారు. అయితే ఈ షో పై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతిభ ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగే నిధుల ద్వారా అవసరమైన వాళ్లని ఆదుకుంటామని జయేష్ రంజన్ చెప్పడం వల్ల ఇది ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఆహ వారు నిర్వహిస్తున్న ఈ సూపర్ ఉమెన్ అనే షో కు మంచి ప్రజాధారణ ఉంది. చాలామంది ఆహా ఓటీటీలో దీన్ని వీక్షిస్తున్నారు. మరోవైపు ఆ ప్లాట్‌ఫాంను సినిమాల పరంగా కూడా ఎంతోమంది అనుసరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..