Leading News Portal in Telugu

Mancherial: శరణ్య హత్య కేసులో ట్విస్ట్‌.. బయట పడ్డ భర్త ఆడియో..!


Mancherial: మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన శరణ్య అనే వివాహిత హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తే సుపారి ఇచ్చి హత్య చేయించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సీ.ఐ.ఎస్.ఎఫ్ లో శరణ్య భర్త జియా ఉల్ హక్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. కొద్దిరోజులు సాఫీగా సాగిన వీరి జీవితంలో గొడవలు మొదలయ్యాయి. అయితే జియా విడాకుల కోసం శరణ్యను వేధించడం మొదలు పెట్టాడు. కాగా శరణ్య విడాకులు ఇచ్చేందుకు ససేమిరా అంది. విడాకులు ఇవ్వనని చావనైనా చస్తా కానీ విడాకుల ఇవ్వనంటూ చెప్పడంతో ఆమెపై పగను పెంచుకున్నాడు. నువ్వు విడాకులు ఇవ్వకపోతే నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ ఫోన్ చేసి బెదిరించాడు. అయినా ఆమె బెదరకుండా విడాకులు ఇవ్వనని మెండికేసింది. భార్య శరణ్య ప్రవర్తనపై కోపంతో ఐదారు రోజుల పాటు హత్యకు రెక్కీ వేశాడు. భార్య శరణ్యను చంపేందుకు 6 లక్షలకు పైగా సుపారి ఇచ్చాడు. దీంతో డీల్ ప్రకారం శరణ్య దుండగులు అమెపై దాడి చేసి కిరాతకంగా చంపేశారు. ఏమీ తెలియనట్లు చేతులు దులుపుకునేందుకు జియా భార్య శరణ్య చనిపోయిందంటూ అమాయకంగా నటించాడు.

Read also: Pawan Kalyan: మళ్లీ విశాఖకు పవన్‌కు.. నేడు ఎర్రమట్టి కొండల పరిశీలన

అయితే శరణ్య మరణం కుటుంబ సభ్యులకు తెలియగానే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదంతా భర్త జియా పనేనంటే ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శరణ్య హత్యపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులు జియా ఆడియో పోలీసులకు ఇవ్వగా.. అసలు కథ వెలుగులోకి వచ్చింది. జియానే భార్య శరణ్యను హత్యకు కుట్రచేసి, ఆమెను చంపాడని క్లారిటీ రావడంతో జియాను అతను సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు శరణ్య భర్త జియా ఆడియో వైరల్ గా మారింది. ఆడియోలో నేను కనిపించకుండానే నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ భార్య శరణ్యకు జియా ఇచ్చిన వార్నింగ్ కూడా వుందని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు చేశామని, సూత్ర దారులు పాత్ర దారులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. హత్య చేసిన తరువాత పారిపోయిన నిందితుల కోసం మూడు పోలీస్ టీం. రంగంలోకి దిగారు. ఇవ్వాళ నిందితుల ను అరెస్టు చూపించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈనెల 10 వ తేదీన రైల్వే స్టేషన్ ఏరియాలోని క్యాబిన్ పక్కన శరణ్య హత్య జరిగిన విషయం తెలిసిందే.
Jailer: కమల్ లైఫ్ టైమ్ రికార్డుకి ఆరు రోజుల్లోనే ఎండ్ కార్డ్…