Leading News Portal in Telugu

Manchiryala : భార్య విడాకులు ఇవ్వలేదని దారుణం.. రూ.10 లక్షలు సుఫారి ఇచ్చి హత్య..


ప్రేమించి, పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకున్న ఓ జంట.. పెళ్ళైన కొత్తలో కాపురంగా బాగానే ఉనింది.. ఆ తర్వాత గొడవలు రావడం మొదలయింది..వాళ్లిద్దరి మధ్యకు మూడో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో గొడవలు పెరిగాయి..భర్త మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం.. విడాకులు ఇవ్వాల్సిందేనని పట్టుపట్టడంతో భర్త నుంచి దూరంగా వచ్చేసింది ఆ యువతి. భార్య విడాకులు ఇస్తేనే మరో యువతిని చేసుకునే పరిస్థితి ఉండటంతో ఇక లాభం లేదనుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ భార్యను మట్టుపెట్టాలని ఫిక్స్ అయ్యాడు భర్త..

తన చేతికి మట్టి అంటకుండా.. కొంచెం కూడా జాలి దయలేకుండా పది లక్షలు సుఫారీ ఇచ్చి మరీ హత్య చేయించాడు.. వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన మంచిర్యాలలో జరిగింది..గోపాల్ వాడకు చెందిన బత్తిని శరణ్య, రాళ్లపేటకు చెందిన సయ్యద్ జియా ఉల్ హక్ 2009 లో ప్రేమ వివాహం చేసుకున్నారు.. ఆమె కానిస్టేబుల్ గా పని చేస్తుంది..విధుల్లో భాగంగా పక్క రాష్ట్రం వెళ్లగా కాంచన్ అనే మరో యువతి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబదానికి దారి తీసింది. ఈ విషయం భార్య శరణ్యకు తెలియడంతో పలు మార్లు నిలదీసింది. అయితే ఆ యువతే తన భార్య అని శరణ్యతో తనకు ఎలాంటి సంబందం లేదని విడాకులు ఇచ్చేయ్యంటూ భార్యను వేధించడం మొదలు పెట్టాడు..

దాంతో ఆమె బిడ్డను తీసుకొని పుట్టింటికి వెళ్లింది..శరణ్యను చంపేందుకు మంచిర్యాల జిల్లాకు చెందిన ఎనిమిది మంది ముఠాను సంప్రదించడంతో తొమ్మిది లక్ష రూపాయలకు ఢీల్ సెట్ అయింది. సుఫారి గ్యాంగ్‌తో ఒప్పందం ప్రకారం అడ్వాన్సుగా లక్షా యాభై వేలు చెల్లించడంతో పక్కా ప్లాన్ వేసి అతి కిరాతకంగా హత్య చేశారు.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..