Leading News Portal in Telugu

Liquor Shops Tenders: రేపటితో ముగియనున్న గడువు.. ఈ సారి టార్గెట్ రూ.2 వేల కోట్లు..!


Liquor Shops Tenders: తెలంగాణలో మద్యం వ్యాపారం లాభాల పంటగా భావిస్తుంటారు. అందుకే ఈ వ్యాపారానికి డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. 2021లో మద్యం దుకాణాలు దక్కించుకోడానికి 68 వేలకుపైగా పోటీ పడ్డారు. దరఖాస్తుకు రూ.2 లక్షలు చొప్పున… అప్పట్లో 1357 కోట్లకుపైగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తుల స్వీకరణ ద్వారా…2 వేల కోట్ల ఆదాయాన్ని అర్జించాలని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. తక్కువ దరఖాస్తులు వస్తున్న నిర్మల్‌, ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలకు హైదరాబాద్‌ నుంచి అబ్కారీ శాఖ అధికారులను పంపినట్లు తెలుస్తోంది. గతంలో ఆయా దుకాణాలకు ఎన్ని అర్జీలు వచ్చాయి, ఇప్పుడు ఎన్ని వచ్చాయన్న దానిపై లెక్కలు తీస్తోంది.

రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల ఏర్పాటుకు…ఈ నెల 4వ నుంచి అర్జీల స్వీకరిస్తోంది ఆబ్కారీ శాఖ. ఆశించినంతగా దరఖాస్తులు రాకపోవడంతో…అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. దీంతో ముందస్తు చర్యలు చేపట్టిన సర్కార్‌…గతంలో కంటే దాదాపు 30వేల దరఖాస్తులు అదనంగా వస్తేనే..2 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఇప్పటి వరకు 42వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం ఒక్క రోజే 6,523 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. దరఖాస్తుకు 2 లక్షల లెక్కన ఇప్పటి వరకు…800 కోట్లు ఆదాయం వచ్చింది. దరఖాస్తు చేసుకునే వ్యాపారులకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా అబ్కారీ శాఖ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌-80, సికింద్రాబాద్‌-99, సరూర్‌నగర్‌-134, శంషాబాద్‌-100, మల్కాజ్​గిరి-88, మేడ్చల్‌-114 దుకాణాలు లెక్కన మొత్తం 615 మద్యం దుకాణాలు ఉన్నాయి.