* ప్రకాశం: ఒంగోలు గోపాల్ నగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
* నెల్లూరు: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఉద్యోగుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
* విశాఖ: నేడు జీవీఎంసీ ఎదుట వార్డు, సచివాలయ హెల్త్ సెక్రెటరీల మహాధర్నా.. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
* పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి కొట్టు సత్యనారాయణ.. సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రి
* విజయవాడ: నేడు విజయవాడలో సీఎం జగన్ పర్యటన.. హోటల్ హయత్ ప్లేస్‌ను ప్రారంభించనున్న సీఎం
* విశాఖ: నేడు ఉత్తరాంధ్ర పార్టీ ముఖ్య నాయకత్వంతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్.. ఇవాళ, రేపు పార్టీ సమావేశాలకు ప్రాధాన్యత
* గుంటూరు: నేడు మంగళగిరి కోర్టుకు హాజరుకానున్న నారా లోకేష్.. తనపై, తన కుటుంబంపై అసత్య ఆరోపణల కేసులో లోకేష్ నుండి వాంగ్మూలం నమోదు చేయనున్న కోర్టు
* విజయవాడ: నేడు బెజవాడలో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్ రావు మరో సమావేశం.. కానూరులో ఉన్న సొంత కళ్యాణ మంటపంలో జరగనున్న సమావేశం
* నిర్మల్: నేడు నిర్మల్ బంద్‌కు బీజేపీ పిలుపు.. మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నియోజక వర్గ బంద్‌కు పిలుపు
* నిర్మల్: నేడు జిల్లా కేంద్రంకు బీజేపీ నేత రఘునందన్ రావు రాక.. మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆమరణ దీక్షకు సంఘీభావం తెలపనున్న ఎమ్మెల్యే రఘునందన్