స్టేషన్ ఘనపూర్ లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆసక్తి కర కామెంట్స్ చేశారు. ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మీ అందరిని చూస్తే మళ్ళీ నాకు పాత ఇంటికి వచ్చినట్టు ఉందన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నాకు రాజకీయ జన్మనిచ్చింది.. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు పెట్టిన రాజకీయ బిక్ష వలనే నేను ఇ స్థాయిలో ఉన్న అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను కడియం అన్నారు. నియోజకవర్గ ప్రజలు నాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చేశాను తప్ప.. తప్పు పని చేయలేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
చెడు ప్రవర్తనతో మీకు తలవొంపులు తీసుకువచ్చే పని నేను చేయలేదు.. నేను అలాంటి వ్యక్తిని కూడా కాదు అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. మార్పులు చేర్పులు జరిగే నియోజకవర్గాలలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కూడా ఒకటి.. మార్పు జరిగి నాకు అవకాశం వస్తే నిండు మనసుతో అందరు ఆశీర్వదించాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కోరారు.
ఇన్ని రోజులు మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడేది అని కడియం శ్రీహరి కామెంట్స్ చేశారు. నాకు అవకాశం వస్తే మీరందరూ నన్ను ఆశీర్వదించిన తర్వాత మీ ఎమ్మెల్యే ఎవరు అంటే గల్లా ఎగర వేసుకొని చెప్పే విధంగా నా పనితీరు ఉంటుంది.. నియోజకవర్గానికి చెడ్డ పేరు తేను.. తప్పు చేయను.. కడియం శ్రీహరి వస్తే అవినీతిపరులకు హాడల్.. నేను వస్తున్నాను అంటేనే గోకేవారు, గీకేవారు, భూ కబ్జాదారులు పారిపోవాల్సిందే.. నన్ను ఆశీర్వదిస్తే స్టేషన్ ఘనపూర్ ను మున్సిపాలిటీ చేసి ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తానని కడియం శ్రీహరి తెలిపారు.