Leading News Portal in Telugu

Muralidhar Rao: తెలంగాణలో యువతే గేమ్ చేంజర్లు.. వాళ్ళు మా వైపు వస్తే అతడ్ని ఓడిస్తాం..


నేను చాలా అంశాల మీద స్పష్టంగా మాట్లాడుతు వస్తున్నాను అని బీజేపీ మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళిధర్ రావు అన్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్ అంశాల పైన కూడా మాట్లాడుతున్నాను.. తెలంగాణలో బీజేపీ ఎదుర్కుంటున్న సవాళ్లు, అనుసరిస్తున్న వ్యూహాలపై ప్రధానంగా మాట్లాడుతున్నా.. అదే విషయం నిన్న మాట్లాడిన అని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో కొన్ని మీడియా సంస్థలు చెలిమెలో చాపలు పడుతున్నట్టు ఉంది. బీఆర్ఎస్ ను ఓడించాలని అంటే యువత ముఖ్యం.. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న వర్గం యువతే.. యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. వాళ్ళే గేమ్ చేంజర్లు.. వాళ్ళు మా వైపు వస్తే కేసీఆర్ ను ఓడిస్తామని మురళిధర్ రావు తెలిపారు.

వక్రీకరించడం జర్నలిజం కాదు.. సంక్షేమ ప్రకటనలు, వాగ్దానాలు కాదు అమలులో వైఫల్యాలకు సొమ్ము చేసుకోగలిగితే ఈ ప్రభుత్వాన్ని ఓడించగలుగుతామని మధ్యప్రదేశ్ బీజేపీ ఇంచార్జ్ మురళిధర్ రావు అన్నారు. కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయంగా భావించడం లేదు.. అందులో గెలిచిన ఆ పార్టీలో ఉండరు అనేది ప్రజల్లో బలమైన నమ్మకం ఉంది.. బీజేపీ తెలంగాణలో పెరిగే పార్టీ.. ఇతర పార్టీలు తగ్గేవి అని ఆయన వ్యాఖ్యనించారు. వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా పార్టీలో బాధ్యతలు మారుతాయ అని మురళిధర్ చెప్పారు.

బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ పెరిగింది.. ఈ రోజు కూడా పార్టీ పెరగడం ఖాయమని మురళిధర్ రావు అన్నారు. కర్ణాటకతో మధ్యప్రదేశ్ ను పోల్చడం సరికాదు అని ఆయన కామెంట్స్ చేశాడు. మధ్యప్రదేశ్ లో బీజేపీ గెలుస్తుంది అని చెప్పాను.. బీజేపీ చరిత్ర, నేపధ్యం కలిగిన పార్టీ.. మార్కెట్ లో నిలబడి అమ్ముడు పోయే పార్టీ కాదు.. దుష్ప్రచారంతో రాజకీయాలు చేస్తే ప్రజలు గమనిస్తున్నారు అని మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ మురళిధర్ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.