మియాపూర్ లో దారుణం జరిగింది. భార్యతో పాటు ఆమె కుటుంబాన్ని చంపేందుకు భర్త కుట్ర చేశాడు. పెళ్లి విందులో భార్య కుటుంబ సభ్యులను చంపేందుకు విష ప్రయోగం చేశాడు. ఈ విష ప్రయోగంతో భార్య తల్లి చనిపోగా.. మిగతా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. అజిత్ తన భార్య తమ్ముడి పెళ్లిలోనే ఈ విషప్రయోగం చేశాడు. జూలై ఐదున జరిగిన ఘటనపై పోలీసులు అరెస్టులు చేశారు. యూకే నుంచి వచ్చి భార్య కుటుంబాన్ని చంపేందుకు అజిత్ కుమార్ ప్లాన్ చేశాడు. అయితే, అజిత్ కు సహకరించిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూకేలో ఉండగా భార్యతో అజిత్ కుమార్ కు వివాదాలు తీసుకున్నాడు. యూకే పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో శిరీషపై కోపం పెంచుకొని వాళ్ల కుటుంబాన్ని అంతం చేసేందుకు అజిత్ హైదరాబాద్ కు వచ్చాడు.
అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు ముప్పరపు అజిత్ కుమార్ పరారీలో ఉండగా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య వారి కుటుంబ సభ్యులపై కోపంతో ఆహారంలో విషం కలిసి హత్యయత్నం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. శిరీష తల్లి మహేశ్వరి మృతి చెందగా.. మిగతా కుటుంబ సభ్యులు హస్పిటల్ లో చికిత్స పోందుతున్నారని తెలిపారు.
ఈ సంఘటనపై మియాపూర్ సీపీ ప్రేమ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. మియాపూర్ గోకుల్ ప్లాట్స్ లో ముప్పవరపు శిరీష ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని తెలిపారు. తమపైన విష ప్రయోగం జరిగిందని ఫిర్యాదు అందింది.. తనను మానసికంగా వేధిస్తున్నాడని అరు నెలల క్రితం యుకేలో భర్త అజిత్ కుమార్ పై ఫిర్యాదు చేసినట్లు శిరిష పేర్కొంది. కక్ష పెట్టుకోని కుటుంబం మొత్తాన్ని అంతం చేయాలని అజిత్ చూశాడని ఆమె ఆరోపించింది. ఈ విషయంపై తన మీత్రడు వినోద్ సహకారంతో ఒక గ్యాంగ్ ను అజిత్ కుమార్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. శిరిష తమ్ముడు పెళ్లిలో తినే ఆహారంలో విషం కలిపి వారిని చంపేందుకు ట్రై చేశాడన్నారు. శిరీష దురం చుట్టమైన ముప్పవరపు పురంధర్ కూడా అజిత్ కు సహకరించాడని పోలీసుల విచారణలో తేలింది.
విష ప్రయోగంలో శిరిషతో పాటు తమ్ముడు, తమ్ముడు భార్య, తల్లి, తండ్రి కుటుంబం మొత్తం విష ప్రయేగానికి గురి అయ్యారు. అయితే, చికిత్స పొందుతున్న శిరిష తల్లి జూలై 5న మరణించింది అని మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ అన్నారు. దీంతో నిందితులపై హత్య, హత్యప్రయత్నం కింద కేసు నమోదు చేశామన్నారు. నిందితుల వద్ద నుండి కారు, మూడు ఇంజెక్షన్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేశామని తెలిపారు. ఇద్దరికీ రెండవ పెళ్ళి, ఇద్దరికీ పిల్లలు ఉన్నారు అని సీఐ పేర్కొన్నాడు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీఐ ప్రేమ్ కుమార్ వెల్లడించారు.