Leading News Portal in Telugu

Telangana Govt: ఖాతాలు స్తంభించిన నో ఫికర్.. లక్షలోపు రుణమాఫీ పక్కా చేస్తాం..


Telangana Govt: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ. లక్ష వరకు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమయ్యాయి. అయితే కొంత మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. రైతుల మొబైల్ ఫోన్లకు మెసేజ్ లు వచ్చినా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఖాతాలు స్తంభించడమే ఇందుకు కారణమని బ్యాంకు అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. స్తంభింపచేసిన రైతుల బ్యాంకు ఖాతాలకు కూడా రుణమాఫీ వర్తిస్తుంది. ప్రభుత్వం ప్రకటించిన నిర్ణీత గడువులోగా రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.

Read also: Telangana Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో వచ్చే మూడ్రోజులు వర్షాలు

ఇప్పటి వరకు 16 లక్షల 65 వేల 656 మంది రైతుల ఖాతాలకు ప్రభుత్వం రూ.8,089.74 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. 2018 డిసెంబరు 11 వరకు రూ.కోటి వరకు పంట రుణాల మాఫీ ప్రక్రియ ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. రుణమాఫీ పథకం కింద అర్హులైన రైతుల డేటాబేస్ 2020లో తయారు చేశామని.. బ్యాంకుల విలీన ప్రక్రియ కారణంగా రైతుల ఖాతాల వివరాల మార్పు వల్ల కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయని మంత్రి తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థల ఖాతాల్లో మార్పులు, చేర్పులు తరచూ జరుగుతున్నాయన్నారు. బ్యాంకుల విలీన ప్రక్రియ కారణంగా రైతుల ఖాతా వివరాల్లో మార్పుల వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయి. అప్పటి నుంచి ఖాతా నంబర్లు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లను అప్‌డేట్‌ చేసేందుకు బ్యాంకర్లకు మూడుసార్లు డేటా ఇచ్చారు. ఇందుకోసం ఖాతాలను ఒకసారి అప్‌డేట్ చేశారు. మళ్లీ.. రైతుల పూర్తి వివరాలు బ్యాంకుల వద్ద అందుబాటులో ఉన్నాయి.ఏ కారణం చేత బ్యాంకు ఖాతాలు మూసివేసినా, ఖాతాలో నంబర్ మారినప్పటికీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిద్రాణమైన ఖాతాలు, డీబీటీ విఫలమైన ఖాతాలు ఉన్న రైతులకు కూడా పంట రుణం అందుతుందని వ్యవసాయ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి తెలిపారు.
Astrology: ఆగస్టు 20, ఆదివారం దినఫలాలు