అది రా పవన్ రేంజ్.. వేరే ఏ హీరోకు లేదు ఈ రికార్డ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ పేరు లో ఉండే మ్యాజికే వేరు. ఆయనకు అభిమానులు కాదు భక్తులు మాత్రమే ఉంటారు. ఆ భక్తులు అప్పుడప్పుడు తమ దేవుడు కోసం ఏదైనా చేయడానికి సిద్దపడుతుంటారు. విమర్శలను పట్టించుకోకుండా హీరోగా పవన్ ఎదిగిన తీరు ఎంతో ఆదర్శదాయకం. పవన్ రాజకీయ నాయకుడిగా మారక ఆ ట్రోల్స్ ఇంకా పెరిగిపోయాయి. అయినా వీటిని పట్టించుకోకుండా ప్రజల కోసం కష్టపడుతున్నాడు. అదే పవన్ ఫ్యాన్స్ కు మరింత నచ్చుతుంది. మిర్చి లో ఒక డైలాగ్ ఉంటుంది. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి అని.. ఇప్పుడు అదే నిజమైంది. అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్.. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అనేగా.. సాధారణంగా అభిమానులు.. హీరోల డ్రాయింగ్స్ వేస్తూ ఉంటారు. వాటిని ఫ్రేమ్స్ కట్టించి హీరోలకు గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు.. ఇంకొంతమంది అభిమానులకు అమ్ముతూ ఉంటారు. మహా అయితే ఒక ఫ్రేమ్ ఎంత ఉంటుంది.. ఒక వెయ్యి.. రెండు వేలు.. పోనీ పది వేలు అనుకుందాం. కానీ, ఇక్కడ మాత్రం ఒక్క పవన్ కళ్యాణ్ డ్రాయింగ్ ఫొటో అక్షరాలా.. 520 డాలర్లు అంటే మన రూపాయల్లో 43,241 రూపాయలు. అవును ఇప్పటివరకు ఏ హీరో కక్రియేట్ చేయలేని రికార్డు ఇది. బ్రో సినిమాలో పవన్ లుక్ ను చేత్తో గీసిన ఈ ఆర్ట్ ను అమెరికాలో ఉంటున్న ఒక పవన్ అభిమాని 520 డాలర్లు పెట్టి కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు అది రా పవన్ రేంజ్.. వేరే ఏ హీరోకు లేదు ఈ రికార్డ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ ఇంకోపక్క రాజకీయాలతో కూడా బిజీగా ఉన్నాడు. మరి వచ్చే ఏడాది పవన్ రాజకీయాల్లో గెలుస్తాడో లేదో చూడాలి.
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్.. 26న చేవెళ్ల సభలో వైఖరి తేల్చనున్న కాంగ్రెస్
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆదివారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. ఈ నెల 26న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు. ఈ సభలో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇదే సభలో ఎస్సీ, ఎస్టీల ప్రకటనను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ విషయాలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో నేతలు చర్చించనున్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో పొందుపరిచిన అంశాలతోపాటు పొందుపరచాల్సిన అంశాలపై చర్చిస్తారు. ఈ నెల 26న చేవెళ్లలో నిర్వహించనున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా ఖర్గేతో అసెంబ్లీ గురించి చర్చిస్తున్నారు.
బీఆర్ఎస్ తో తెలంగాణ మారింది.. జగిత్యాల ఎమ్మెల్యే కామెంట్స్
బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ ఎంతగానో మారిపోయిందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. బీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రజా వ్యతిరేకత, పలు వివాదాల కారణంగా ఈసారి కొంతమంది సిట్టింగులకు పోటీ చేసే అవకాశం రాకపోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల పట్టణంలోని 10వ వార్డులో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ విచ్చేశారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే స్థానికులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో జగిత్యాలలో మళ్లీ ఎవరు పోటీ చేస్తారో తెలియదని మళ్లీ అవకాశం వస్తే ఓటు వేసి మళ్లీ గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. తాను కాకుండా ఎవరు పోటీ చేసినా బీఆర్‌ఎస్ పార్టీ గెలవాలని సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జేసీ ప్రభాకర్ రెడ్డిపై పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు
జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ తన కుమారుడ్ని ఎమ్మెల్యే చేసుకునేందుకు.. జేసీ దివాకర్ రెడ్డిని చంపాలని అనుకుంటున్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు. బెడ్‌పై ఉన్న ఆయన సోదరిని సైతం చంపాలనుకున్నాడని బాంబ్ పేల్చారు. ఇప్పుడు దివాకర్‌రెడ్డిని చంపి, ఆ సానుభూతి తాను పొందాలని ప్రభాకర్ భావిస్తున్నాడని పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి టిక్కెట్ జేసీ ప్రభాకర్ రెడ్డికి వచ్చే అవకాశాలు లేవని.. ఉనికి కోసం ఆయన పాకులాడుతున్నాడని పేర్కొన్నారు. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇప్పటికే మతిస్థిమితం కోల్పోయారన్నారు. త్వరలో జేసీ ప్రభాకర్ రెడ్డికి కూడా ఆ జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తాడిపత్రి హైస్కూల్‌లో నాడు – నేడు పనులను జేసీ అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. హైస్కూల్ మైదానంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైస్కూల్ కాంపౌండ్ వాల్ కడితే.. తన కార్యకలాపాలు సాగవని జేసీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రపంచకప్‌లో వికెట్ కీపర్‌గా అతడే బెటర్: గంగూలీ
ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో భారత జట్టులో ఎవరు ఉంటారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మిడిల్ ఆర్డర్, కీపర్ స్థానాలపై సందిగ్థత నెలకొంది. ముఖ్యంగా వికెట్ కీపర్‌గా ఎవరు ఆడుతారని ప్రతి ఒక్కరి మదిని కలిచివేస్తోంది. రిషబ్ పంత్ గాయపడడంతో.. ప్రపంచకప్ 2023లో ముగ్గురు ఆటగాళ్లు రేసులో ఉన్నారు. సీనియర్లు కేఎల్ రాహుల్, సంజూ శాంసన్‌తో పాటు యువ ఆటగాడు ఇషాన్ కిషన్ రేసులో ఉన్నాడు. ఏ ముగ్గురిలో ఎవరికి అవకాశం ఇస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సంజూ శాంసన్ గొప్ప ప్రదర్శన చేయకపోవడంతో అతడికి వన్డే ప్రపంచకప్ 2023లో చోటు దక్కడం కష్టమే. కేఎల్ రాహుల్‌తో పాటు ఇషాన్ కిషన్‌ను బ్యాకప్‌గా తీసుకుంటారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన అభిప్రాయం వెల్లడించారు. ‘రిషబ్ పంత్ అత్యుత్తమ కీపర్. ఇషాన్ కిషన్‌తో పాటు కేఎల్ రాహుల్ కూడా నాణ్యమైన ప్లేయర్స్. అయితే రాహుల్ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. రాహుల్, ఇషాన్ ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ మదిలో ఉంటారు. నేను ఇషాన్ వైపే మొగ్గు చూపుతా’ అని దాదా అన్నారు.
పరీక్షిస్తుండగా పొలాల్లో కుప్పకూలిన డీఆర్‌డీవో డ్రోన్
డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)కి ఆదివారం ఓ చేదువార్త ఎదురైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో గల ఓ గ్రామంలో డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన తపస్ డ్రోన్ పరీక్షిస్తుండగా కూలిపోయింది. చిత్రదుర్గ జిల్లా హరియూర్ తాలుకాలోని వడ్డికెరె గ్రామంలోని పొలాల్లో డ్రోన్ కూలిపోయినట్లు రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కూలిన డ్రోన్‌ను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం వెనుక నిర్దిష్ట కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. డ్రోన్ ఖాళీ పొలంలో పడిపోయింది. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గత కొంతకాలంగా డీఆర్‌డీవో మానవరహిత వైమానిక వాహనం(యూఏవీ) అభివృద్ధిపై పరిశోధనలు చేస్తోంది. తపస్ పేరుతో రూపొందిస్తున్న ఈ డ్రోన్‌ను ఆదివారం ఉదయం డీఆర్‌డీవో పరీక్షిస్తుండగా కూలిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదం గురించి రక్షణ శాఖకు సమాచారం అందింది. ఈ ప్రమాదం తర్వాత డ్రోన్ విరిగిపోయి దాని పరికరాలు నేలపై చెల్లాచెదురుగా ఉన్నట్లు వీడియోలో చూడవచ్చు. పెద్ద శబ్ధంతో యూఏవీ కూలిన వెంటనే గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
ఆపత్కాల సమయంలో డాక్టర్స్, స్టాఫ్ నర్స్‌లో సేవలు వెలకట్టలేనిది
సాధారణ బిల్లుతో రోగులపైన అధిక ఫీజుల, భారం మోపకుండా సేవ చేయాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ లో మెడికవర్ హాస్పిటల్ 25వ శాఖను ఆయన ప్రారంభిస్తూ మాట్లాడారు.. ఆపత్కాల సమయంలో క్టర్స్, స్టాఫ్ నర్స్ లో సేవలు వెలకట్టలేనివని, కరోనా విపత్కర పరిస్థితిలో సాహసోపేతమైన విధులు నిర్వహించారని స్పీకర్ వారిని కొనియాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఆరోగ్య రాష్ట్ర తెలంగాణగా మార్చనున్నారని, ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పటివరకు 20,000 బెడ్స్ సామర్థ్యం నుంచి 50 వేల బెడ్స్ సామర్థ్యానికి పెంచబోతున్నారని, రాష్ట్రంలోని నిమ్స్ హాస్పిటల్ 4000 పడకల ఆసుపత్రిగా త్వరలోనే రూపుదిద్దుకోనున్నదని ఆయన అన్నారు.
రష్యా మూన్ మిషన్ ఫెయిల్.. చంద్రునిపై కుప్పకూలిన లూనా 25
దాదాపు 47 ఏళ్ల తర్వాత రష్యా చేపట్టిన మొట్టమొదటి మూన్ మిషన్ లూనా-25 అంతరిక్ష నౌక చంద్రుడిపై కూలిపోయింది. ల్యాండింగ్‌కు ముందు విన్యాసాల సమయంలో చంద్రునిపై అంతరిక్ష నౌక కూలిపోయిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ ఆదివారం తెలిపింది. శనివారం మధ్యాహ్నం 2.57 గంటలకు Luna-25తో కమ్యూనికేషన్ పోయిందని రోస్కోస్మోస్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రాథమిక పరిశోధనల ప్రకారం.. ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని ఢీకొన్న తర్వాత ఉనికిలో లేదని పేర్కొంది. రోస్కోస్మోస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, మిషన్‌లోని క్లిష్టమైన దశలో అనుకోని సమస్య కారణంగా అంతరిక్ష నౌకతో సంబంధాలు కోల్పోయినట్లు ఏజెన్సీ వెల్లడించింది. ఈ ఆకస్మిక, ఊహించని ముగింపు రష్యా అంతరిక్ష అన్వేషణ ఆశయాలకు గణనీయమైన ఎదురుదెబ్బను సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రీయ, అంతరిక్ష సంఘాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
సీడబ్ల్యూసీలో ఏపీకి చెందిన రఘువీరారెడ్డికి చోటు
ఏపీలో పార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉనికే లేని ఏపీలో మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి కీలకమైన సీడబ్ల్యూసీలో స్థానం కల్పించారు. తెలంగాణకు ప్రత్యేక ఆహ్వానితుల కోటాలో ఇద్దరికి చోటు కనిపించిన ఏఐసీసీ అధిష్టానం.. ఏపీకి మాత్రం సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యత్వాన్ని రఘువీరారెడ్డికి ఇచ్చింది. వాస్తవంగా రఘువీరారెడ్డి 2018 ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్యే రాయ్ పూర్ లో జరిగిన ఏఐసీసీ ప్లీనరీలో రఘువీరా పాల్గొన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. కానీ ఏపీలో మాత్రం అతను యాక్టీవ్ గా లేరు.
మరోవైపు పార్టీ అంతా ఆయన రాజకీయాల నుంచి విరమించినట్టుగా భావిస్తున్న సమయంలో ఆయనకు సీడబ్ల్యుూసీలో స్థానం కల్పించడం పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు ఉన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ కు మాత్రం సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యత్వం దొరకలేదు. దామోదర రాజనర్సింహ వంశీచంద్రెడ్డికి ప్రత్యేక ఆహ్వానితుల కోటాలో స్థానం కల్పించారు. అలాగే మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజులు కూడా ఈ కోటాలోనే చేర్చారు. అలాగే టి.సుబ్బరామిరెడ్డి హైదరాబాద్ లో ఆయన నివాసం ఉంటున్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.
తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులను సీఎం కేసీఆర్ మరిచారు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులను సీఎం కేసీఆర్ మరిచారని, ఉద్యమ ద్రోహులకు తన కేబినెట్‌లో చోటిచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడని ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికలు రాగానే డబ్బు సంచులతో మళ్ళీ అధికారంలోకి రావడం కోసం సర్వ ప్రయత్నాలు చేస్తారని, బీజేపీలో సీట్లు ప్రకటన చేసేది మా ఢిల్లీ పెద్దలు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుండి చేస్తానన్నారు. ఇతర పార్టీల లాగా బీజేపీలో ఉండదు నా సీటు మీద కూడా నాకు నమ్మకం లేదు సీటు కేటాయించేది ఢిల్లీ పెద్దలే అని ఆయన వెల్లడించారు. మేము ప్రకటన చేసే అభ్యర్థుల స్థానాలను రేపు కేసీఆర్ ప్రకటన చేస్తున్నారని, మరొక్కసారి కేసీఆర్ కు ఓటు వేసి ప్రజలు మోస పోవద్దన్నారు బండి సంజయ్. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అంశం సీబీఐ, ఈడీలు చూసుకుంటాయన్నారు.
చంద్రయాన్-3పై ఇస్రో కీలక ప్రకటన.. సర్వత్రా ఉత్కంఠ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంపై కీలక ప్రకటన చేసింది. చంద్రయాన్-3లో కీలకఘట్టం పూర్తి అయినట్లు ప్రకటించింది. చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ చివరి డీబూస్టింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు శనివారం అర్ధరాత్రి దాటాక ఇస్రో ప్రకటించింది. ప్రస్తుతం విక్రమ్ ల్యాండర్ 25 కి.మీX 134కి.మీ కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్‌పై ఇస్రో దృష్టి పెట్టింది. ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 6.04గంటలకు చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ కానున్నట్లు ఇస్రో వెల్లడించింది. అన్నీ అనుకూలిస్తే ఇస్రో ఆగస్టు 23న చంద్రుడి దక్షిణధ్రువంపై ఘనంగా కాలుమోపనుంది.
అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం
హనుమకొండ జిల్లా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, తూర్పు ఎమ్మెల్యే నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాలకి గ్రేటర్ పరిధిలో 1000 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. తక్షణ మరమ్మత్తుల కోసం మంత్ర కేటీఆర్ 250 కోట్లను విడుదల చేశారని, గత ప్రభుత్వాల హయాంలోనే నాలాల ఆక్రమణలకు గురయ్యాయన్నారు వినయ్ భాస్కర్. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, టికెట్ ఎవరికీ ఇచ్చిన పార్టీ సైనికులుగా కార్యకర్తగా పనిచేస్తామన్నారు. అకాల వర్షాల కారణంగా వరంగల్ పట్టణంలో అనేక ఇబ్బందులు ఎదురుకొన్నామని, నగరంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. గతంలో నగరాన్ని సందర్శించి కేటీఆర్ 250కోట్లు మంజూరు చేయడం జరిగిందని, పెద్ద ఎత్తున కురిసిన వర్షాల కారణంగా సమ్మయ్య నగర్, జవహర్ నగర్ వరద ముంపు కు గురి కావడం జరిగిందన్నారు.
లోకేష్ చేసేది ఈవినింగ్ వాక్.. యువగళంకు ప్రజాదరణ లేదు
తాడేపల్లిలో మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మల్లాదివిష్ణు, దేవినేని అవినాష్ లు ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో భాగంగా వెలంపల్లి మాట్లాడుతూ.. చంద్రబాబు కుమారుడు లోకేశ్ పాదయాత్రకు ప్రజాదరణ లేదని ఆరోపించారు. కొడుకు పాదయాత్రకు ప్రజాదరణ లేదని తెలుసుకున్న బాబు, పవన్ కళ్యాణ్ తో వారాహి యాత్ర చేయిస్తున్నాడని విమర్శించారు. యాత్రలో భాగంగా పవన్ మాట్లాడే మాటలు ఎవరికి అర్థం కావన్నారు. పొంతన లేని మాటలు మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అంతేకాకుండా.. వృద్ద తండ్రి చంద్రబాబు కూడా యాత్రలు చేస్తున్నారని విమర్శనాస్త్రాలు గుప్పించారు.